వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాపై చర్యలు తప్పవన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ఉత్తర కొరియా అణుముప్పును కట్టడి చేయడంలో చైనా ఏ మాత్రం సహకరించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇందుకు చైనా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తర కొరియా అణుముప్పును కట్టడి చేయడంలో చైనా ఏ మాత్రం సహకరించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇందుకు చైనా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. చైనాపై వాణిజ్య పరమైన చర్యలు తప్పవని ఆయన ప్రకటించారు.

యూరప్ పర్యటనకు ట్రంప్ బుదవారం నాడు బయలు దేరి వెళ్ళారు. జర్మనీ హంబర్గ్ లో జరగనున్న జీ 20 దేశాల సదస్సులో భాగంగా ట్రంప్ చైనా అధ్యకషుడు గ్జీ జిన్ పింగ్ తో భేటీ కానున్నారు. ఈ బేఠీకి ముందే ఆయన చైనాపై విరుచుకుపడ్డారు.

Trump slams China ahead of meeting with Xi

ఉత్తర కొరియా చేపడుతున్న అణ్వాయుధ, క్షిపణి పరీక్షలను ఆ దేశ మిత్రపక్షమైన చైనా కట్టడి చేయాలని అందుకు ప్రతిఫలంగా ఛైనాతో అమెరికా మంచి వాణిజ్య ఒప్పందాలను చేసుకొంటుందని ట్రంప్ ఊరించారు. ఉత్తరకొరియా ఇటీవల అమెరికా, పశ్చిమ దేశాలను ఢీకొట్టగలిగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించడం అమెరికాను కలవరపాటుకు గురిచేస్తోంది.

ఈ క్షిపణి ప్రయోగంతో అమెరికాకు అణుముప్పు పెరిగిందని భావిస్తోంది అమెరికా. అయితే దీన్ని కట్టడి చేయడంలో వైఫల్యం చెందిన చైనాను టార్గెట్ చేసుకోవాలని భావిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా, ఉత్తర కొరియా మధ్య వాణిజ్యం 40 శాతం పెరిగింది. చైనా ఎందుకు కొరియాను కట్టడి చేయడం లేదని ఆయన ట్వీట్ చేశారు.

జీ 20 దేశాల సదస్సులో ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం కానున్నారు. ఉత్తరకొరియా తాజాగా చేపట్టిన బాలిస్టిక్ క్షిపణుల పరీక్షల నేపథ్యంలో చైనా, రష్యాల తీరుపై అమెరికా మండిపడింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ తో చైనా , రష్యాల చేతిలో చేయి వేసి ముందుకు సాగుతున్నాయని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబాది నిక్కీ హేలీ మండిపడ్డారు. ఉత్తరకొరియా తీరును ఖండిస్తూ ఆ దేశంపై మరిన్ని తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఐరాస భద్రతా మండలి తీర్మాణం చేయడానికి అడ్డుపడుతున్న చైనా,,రష్యా తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు.

English summary
U.S. President Donald Trump accused China of non-cooperation in dealing with the North Korean nuclear threat, and threatened retaliatory trade measures against Beijing as he left for Europe on Wednesday morning. The President has been pressing China to rein in the North Korean regime to roll back its nuclear and missile programmes and had offered a “better trade deal” in return.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X