వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ఎస్ఎస్‌లో మహిళలను చేర్చుకోవాలి: తృప్తి దేశాయ్

|
Google Oneindia TeluguNews

ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆలయాల్లో స్త్రీల ప్రవేశం కోసం పోరాడుతున్న భూమాత బిగ్రేడియర్ నాయకురాలు తృప్తి దేశాయ్ డిమాండ్ చేశారు.

మహిళల ఓట్లతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆర్ఎస్ఎస్ కూడా తమ సభ్యులుగా మహిళలను అనుమతించాలని ఆమె అన్నారు. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కు లేఖ రాయనున్నట్టు చెప్పారు .

Trupti Desai, of temple entry fame, now wants RSS to admit women

స్త్రీ, పురుష సమాన హక్కుల కోసం మోహన్ భాగవత్ మద్దతు కోరతామన్నారు.
తృప్తి దేశాయ్ పోరాటంతో ఇటీవలే శని సింగనాపూర్, నాసికా త్రయంబకేశ్వర్ ఆలయాల్లోకి మహిళలను అనుమతించిన సంగతి తెలిసిందే.

కాగా, బిజెపి ఉపాధ్యక్షుడు కాంత నలవాడే మాట్లాడుతూ.. దేశాయ్ డిమాండ్లు అర్ధరహితమని అన్నారు. అనవసరమైన సమస్యలు సృష్టించకుండా.. మహిళలను వేధిస్తున్న ఇతర సమస్యల పరిష్కారంపై పోరాడితే మంచిదని సూచించారు.

English summary
The Rashtriya Swayamsevak Sangh (RSS) must allow women to become its members, Trupti Desai, who has been leading a campaign for women's right to worship in temples, said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X