• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సత్యం, న్యాయమే గెలిచాయి : జాదవ్ తీర్పుపై మోడీ

|

న్యూఢిల్లీ : కుల్‌భూషణ్ జాదవ్ ఉరిశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టు స్టే విధించడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని ట్వీట్ చేశారు. వాస్తవాల ఆధారంగా తీర్పు వెలువడిందని గుర్తుచేశారు. జాదవ్‌కు న్యాయం జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. జాదవే కాదు ప్రతి భారతీయుడి సంక్షేమం కోం ప్రభుత్వం పాటుపడుతుందని ఉద్ఘాటించారు. దీంతో సత్యం, న్యాయమే గెలిచాయని పేర్కొన్నారు. ఇది మనకు అంతర్జాతీయ కోర్టులో లభించిన గొప్ప విజయమని అభివర్ణించారు.

 Truth And Justice Have Prevailed: Modi on jadav

నేతల హర్షం

జాదవ్ కేసులో అంతర్జాతీయ కోర్టు తీర్పును కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ చొరవను మాజీ కేంద్రమంత్రి సుష్మస్వరాజ్ అభినందించారు. మోడీ సర్కార్ చర్యలతో అంతర్జాతీయ కోర్టులో జాదవ్‌కు ఊరట కలిగిందని పేర్కొన్నారు. మరోవైపు జాదవ్ ఉరిశిక్షను పున:సమీక్షించాలన్న అంతర్జాతీయ కోర్టు తీర్పును గౌరవిస్తామని పాకిస్థాన్ లాయర్లు తెలిపారు. ఉరిశిక్షను పున:సమీక్షించాలని చెప్పడంతో .. ఈ కేసులో భారత్ వాదనలు వినిపించనున్నది.

ఏం జరిగిందంటే

బలూచిస్థాన్‌లో ఉన్న జాదవ్‌ను పాకిస్థాన్ మిలిటరీ అదుపులోకి తీసుకుంది. 2016 మార్చి 3న .. ఇరాన్ నుంచి వ్యాపార నిమిత్తం వస్తోన్న అతడిని అరెస్ట్ చేసింది. తర్వాత జాదవ్ కిడ్నాప్‌నకు గురయ్యాడని భారత్ ఫిర్యాదు చేసింది. కానీ ఇరాన్‌లో లేకపోవడంతో అనుమానం వచ్చింది. కానీ తొలుత నిరాకరించిన తర్వాత తమ వద్దే ఉన్నాడని అంగీకరించింది. తమ దేశంపై నిఘా పెట్టారనే ఆరోపణలు మోపి .. మిలిటరీ కోర్టులో అభూత సాక్ష్యాలు ప్రవేశపెట్టింది. ఆ తర్వాత జరిగిన ఉద్రిక్తతతో .. జాదవ్ తల్లి, భార్య .. 2017 డిసెంబర్ 25న జైలులో కలిసిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు ఊరట లభించింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi today said that truth and justice have prevailed after the International Court of Justice, in a huge win for India, ruled that Pakistan must review the death sentence of Kulbhushan Jadhav and grant New Delhi consular access to the retired navy officer. PM Modi said the International Court of Justice verdict is based on facts and that his government will always work for the safety of every Indian.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more