వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ మూడింటిని ఎన్నటికీ దాచిపెట్టలేరు.. గురు పూర్ణిమ వేళ రాహుల్ ట్వీట్.. ప్రజలకు మోదీ విషెస్..

|
Google Oneindia TeluguNews

వేదవ్యాసుడి జయంతి, గౌతమ బుద్ధుడి ధర్మచక్రపరివర్తనను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రజలు ఆదివారం గురు పూర్ణిమ వేడుకలు జరుపుకొంటున్నారు. బోధ గయలో గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం అయిన తర్వాత.. గురు పూర్ణిమ నాడే తన మొదటి బోధను సారనాథ్ లో ఇచ్చిఉండటంతో ఈ రోజును హిందువులతోపాటు బౌద్ధులూ ప్రశస్తంగా భావిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సహా పలు పార్టీల కీలక నేతలంతా శుభాకాంక్షలు తెలియజేశారు.

 చైనాపై ప్రధాని మోదీ పంచముఖ వ్యూహం.. లదాక్ ఎందుకు వెళ్లారంటే.. ఇక డ్రాగన్ పని అయినట్లే.. చైనాపై ప్రధాని మోదీ పంచముఖ వ్యూహం.. లదాక్ ఎందుకు వెళ్లారంటే.. ఇక డ్రాగన్ పని అయినట్లే..

''సూర్యుడు, చంద్రుడు, యథార్థం.. ఈ మూడింటిని ఎన్నటికీ దాచిపెట్టలేమని గౌతమ బుద్ధుడు అన్నారు. గురు పూర్ణిమ సందర్భంగా ప్రజలకు శుభాభినందనలు..'' అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. చైనా సరిహద్దులో జరుగుతోన్న విషయాలపై కేంద్రం అబద్ధాలు చెబుతోందంటూ కొంతకాలంగా విమర్శలు చేస్తోన్న రాహుల్.. ఇలా గురు పూర్ణిమ సందర్భాన్ని కూడా వదలకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Truth cannot be hidden says Rahul gandhi, pm modi also wishes on Guru Purnima

Recommended Video

#IndiaChinaFaceOff : Watch IAF Apache, IAF’s Fighter Aircraft Jets Patrolling At LAC || Oneindia

గురు పూర్ణిమపై దేశప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ''మన జీవితాలను అర్ధవంతంగా మార్చే గురువులను గౌరవించుకోడానికి ఇదొక ప్రత్యేకమైన రోజు. ఈ సందర్భంగా, గురువులందరికీ నా శుభాకాంక్షలు'' అని మోదీ ఆదివారం ట్విటర్ లో సందేశమిచ్చారు. శనివారం నిర్వహించిన 'ధర్మచక్ర దినోత్సం'లోనూ మోదీ కీలక ప్రసంగం చేశారు. గురువులు చూపిన బాటలో పయనించాలని, బుద్ధుడు నేర్పిన జ్ఞానాన్ని అనుసరించాలని మోదీ సూచించారు.

English summary
prime minister narendra modi and senior congress leader Rahul Gandhi extends wishes on Guru Purnima. quoting Gautam buddha, rahul says truth can not be hidden.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X