చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిన్నమ్మ శశికళ ఫ్యామిలీలో మరో కొత్త పార్టీ టీవీవీ VSటీవీవీ, ప్రధాని మోడీ, మద్దతు !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో మరో కొత్త పార్టీ ప్రారంభం అయ్యింది. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన చిన్నమ్మ వీకే. శశికళ, ఆమె కుటుంబ సభ్యులు రాజకీయాలకు దూరం కావడం జీర్ణించుకోలేకపోతున్నారు. శశికళ సమీప బంధువు కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించి ప్రధాని మోడీకి మద్దతు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. రాజకీయంగా తిరుగతూ మీడియాలో వార్తల్లో నిలవాలని శశికళ కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

<strong>జైల్లో ఏసీ, టీవీ, బెడ్, లిక్కర్, వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, ఖైదీ లగ్జరీ లైఫ్, ఫోటోలు వైరల్!</strong>జైల్లో ఏసీ, టీవీ, బెడ్, లిక్కర్, వాషింగ్ మెషిన్, స్మార్ట్ ఫోన్, ఖైదీ లగ్జరీ లైఫ్, ఫోటోలు వైరల్!

అదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే. శశికళను పార్టీ నుంచి బహింష్కరించిన విషయం తెలిసిందే. శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు అందర్నీ అన్నాడీఎంకే పార్టీకి దూరం చేశారు.

ఆర్ కే నగర్ ఎమ్మెల్యే

ఆర్ కే నగర్ ఎమ్మెల్యే

శశికళ సమీప బంధువు టీటీవీ దినకరన్ ఇప్పటికే కొత్త పార్టీ పెట్టి ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. తమిళనాడులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి టీవీవీ దినకరన్ తమిళనాడులోని అన్ని జిల్లాల్లో తిరుగుతున్నాడు.

సోదరుడికి పోటీ

సోదరుడికి పోటీ

టీటీవీ దినకరన్ సొంత సోదరుడు టీటీవీ భాస్కరన్ తాను సొంత పార్టీ పెడుతానని కొంత కాలంగా చెబుతూ వచ్చాడు. టీటీవీ దినకరన్ కు పోటీగా టీటీవీ భాస్కరన్ ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థి అయ్యాడు. శనివారం టీటీవీ భాస్కరన్ కొత్త పార్టీ ప్రారంభించాడు.

ఎఎంఎంకే పార్టీ

ఎఎంఎంకే పార్టీ

చెన్నైలోని ఈసీఆర్ రోడ్డులోని నీలాంబరై ప్రాంతంలోని సొంత ఇంటిలో టీటీవీ భాస్కరన్ అన్నా ఎంజీఆర్ మక్కల్ కగళం (ఎఎంఎంఏ) పార్టీని ప్రకటించారు. పార్టీ జెండాను సైతం ఇదే సందర్బంలో ప్రదర్శించారు. ఈ సందర్బంగా టీటీవీ భాస్కరన్ విలేకరులతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తామ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్లా పోటీ చేస్తారని అన్నారు.

ప్రధాని మోడీకి జై

ప్రధాని మోడీకి జై

ఎంజీఆర్ ఆశయాలకు అనుగుణంగా తమ పార్టీ పని చేస్తుందని టీటీవీ భాస్కరన్ ప్రకటించారు. తమ పార్టీ ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తోందని టీటీవీ భాస్కరన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ఎంతో అభివృద్ది చేశారని టీటీవీ భాస్కరన్ కితాబునిచ్చారు.

కేసుల్లో ఉన్న లీడర్

కేసుల్లో ఉన్న లీడర్

టీటీవీ దినకరన్ తో కలిసి తమ పార్టీ పని చెయ్యదని, సొంతంగా ఎన్నికల బరిలోకి దిగుతామని, ప్రజాసేవ చేస్తామని టీటీవీ భాస్కరన్ చెప్పారు. ఈ సందర్బంలో టీటీవీ భాస్కరన్ తన మద్దతుదారులతో సమావేశం అయ్యారు. టీటీవీ భాస్కరన్ ఆర్ బీఐలో ఉద్యోగం చేసి స్వచ్చందంగా రాజీనామా చేశారు. టీటీవీ భాస్కరన్ మీద కొన్ని కేసులు విచారణలో ఉన్నాయి.

English summary
TTV Baskaran extends his support to PM Narendra Modi as he starts new party by naming Anna MGR Makkal Kazhagam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X