వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుకేష్ కస్టడీకి పోలీసులకు చుక్కలు: కోర్టులు, జడ్జీల ఇళ్లకు పరుగు!

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపిన కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లంచం కేసులో టీటీవీ దినకరన్ మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్ చంద్రశేఖర్‌‌ను సోమవారం మధ్యాహ్నం ఢ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపిన కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. లంచం కేసులో టీటీవీ దినకరన్ మధ్యవర్తిగా చెబుతున్న సుకేశ్ చంద్రశేఖర్‌‌ను సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అరెస్టు వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే పోలీసులకు అసలు కష్టాలు మొదలయ్యాయి.

కస్టడీ కోసం కష్టాలు

కస్టడీ కోసం కష్టాలు

అరెస్టు తర్వాత సుకేష్‌ని తమ కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు న్యాయమూర్తి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో తొలుత అతడిని పాటియాలా కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులు భావించారు. సెంట్రల్ కోర్టు సముదాయంలో కొద్దిసేపు పడిగాపులు కాచిన పోలీసు అధికారులు అక్కడ న్యాయమూర్తి అందుబాటులో లేకపోవడంతో మరోకోర్టుకు పయనమయ్యారు.

'సుఖేష్' గురించి విస్తుపోయే నిజాలు: ఇన్ని ఆస్తులా?.. 'సుఖేష్' గురించి విస్తుపోయే నిజాలు: ఇన్ని ఆస్తులా?..

మరో జడ్జీ కోసం

మరో జడ్జీ కోసం

ఇక్కడికి 20 నిమిషాలపాటు ప్రయాణించి.. మరో జిల్లా కోర్టయిన టిస్ హజారీ కోర్టుకు చంద్రశేఖర్‌‌ను తరలించారు. అప్పటికే సాయంత్రం 4:40 కావడంతో నేరుగా కోర్టు రూమ్ నెంబర్ 25లోకి తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యేక న్యాయమూర్తి పూనం చౌదరి మధ్యాహ్నం సెలవులో ఉండడంతో పనిజరగలేదు. అక్కడి నుంచి నిందితుడ్ని అదేకోర్టులో 313 నెంబర్ రూమ్‌కి తీసుకెళ్లారు.

ఎక్కడికెళ్లినా అదే సీన్..

ఎక్కడికెళ్లినా అదే సీన్..

313 నెంబర్ రూంలో ఉండాల్సిన ఎంకే నాగ్‌పాల్ అనే ప్రత్యేక జడ్జీ కూడా అందుబాటులో లేకపోవడంతో 139 రూమ్‌కి తీసుకెళ్లారు. అక్కడా అదే పరిస్థితి. అక్కడ కూడా స్పెషల్ జడ్జి హేమని మల్హోత్రా అందుబాటులో లేరు. దీంతో రూమ్ నెంబర్ 38 వద్ద చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సతీశ్ కుమార్ ఆరోరా తలుపుతట్టారు. అయితే సేమ్ సీన్ రిపీటైంది.

ఎట్టకేలకు కస్టడీ

ఎట్టకేలకు కస్టడీ

న్యాయమూర్తుల అనుమతి కోసం అదేపనిగా తిరిగిన పోలీసు అధికారులు.. చివరకు నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్‌ను తీసుకుని నేరుగా ప్రత్యేక న్యాయమూర్తి పూనం చౌదరి ఇంటికి తీసుకెళ్లారు. జడ్జీ ముందు హాజరుపర్చిన తర్వాత.. ఎట్టకేలకు చీకటిపడుతుండగా... చంద్రశేఖర్‌‌ను 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.

English summary
It was a big bust and they needed his custody urgently. However in order to seek the custody of Sukesh Chandrasekhar, the man who promised T T V Dinakaran the AIADMK's two leaves symbol, the Delhi Crime Branch needed a judge. Sukesh was arrested with Rs 1.3 crore from a hotel in South Delhi and it is alleged that this was the money that was given to him to bribe Election Commission of India officials.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X