వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీటీవీ దినకరన్ కొత్త పార్టీ, రాత్రికి రాత్రి పార్టీ పదవులు, మాజీ మంత్రులు, 15 ఎమ్మెల్యేలతో !

అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు మూడు ముక్కలు అయ్యింది. శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ ఇప్పుడు కొత్త వర్గానికి నాయకత్వం వహిస్తున్నాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు మూడు ముక్కలు అయ్యింది. శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ ఇప్పుడు కొత్త వర్గానికి నాయకత్వం వహిస్తున్నాడు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి టీటీవీ దినకరన్ ను బహిష్కరించిన విషయం తెలిసిందే.

పన్నీర్ పంచ్, శశికళ ఫ్యామిలీకి చావు దెబ్బ: ఎవరీ స్వామినాథన్ కల్యాణసుందరం ? పక్కాస్కెచ్ !పన్నీర్ పంచ్, శశికళ ఫ్యామిలీకి చావు దెబ్బ: ఎవరీ స్వామినాథన్ కల్యాణసుందరం ? పక్కాస్కెచ్ !

టీటీవీ దినకరన్ శుక్రవారం రాత్రి తన కొత్త పార్టీకి నామకరణం చేశాడు. అన్నాడీఎంకే పురట్చి తలైవీ అమ్మ పేరవై పార్టీ పేరుతో కొత్త అవతారం ఎత్తాడు. అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) వర్గంలో ప్రస్తుతం ఉన్న నాయకులను వారి పదవుల నుంచి తొలగించకుండా టీటీవీ దినకరన్ 64 మంది తన అనుచరులకు కీలక పదవులు కట్టబెట్టాడు.

 TTV Dianakaran appoints loyalists to key party post

అన్నాడీఎంకేలోని 18 విభాగాలకు కార్యదర్శలును నియమించారు. అందులో 15 మంది ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలు తోపు వెంకటాచలం, సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితరులకు పార్టీ పదవులు కట్టబెట్టారు.

సీఎంకే షాక్: జైల్లో శశికళతో దినకరన్, నోరుజారాడు, నా వర్గంలో 122 మంది ఎమ్మెల్యేలు !సీఎంకే షాక్: జైల్లో శశికళతో దినకరన్, నోరుజారాడు, నా వర్గంలో 122 మంది ఎమ్మెల్యేలు !

ఆగస్టు 14వ తేదీ నుంచి టీటీవీ దినకరన్ తమిళనాడు రాష్ట్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రచార విభాగం ఉప కార్యదర్శులుగా నాంజిల్ సంపత్, ఇళవరసిలను నియమించారు. నలుగురు మహిళా శాసన సభ్యులు అయిన సత్య పన్నీర్ సెల్వం, ఉమామహేశ్వరీ, చంద్రప్రభ, జయంతి పద్మనాభంలకు పదవులు కట్టబెట్టిన టీటీవీ దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి ఝలక్ ఇచ్చాడు.

English summary
Seeking to reassert his authority in the ruling AIADMK, deputy general secretary TTV Dhinakaran on Friday named several of his loyalists as office-bearers of the party, the first exercise undertaken by him after a two-month hiatus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X