• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శశికళ ఫ్యామిలీ రివర్స్ గేర్, మాటమార్చిన మన్నార్ గుడి, కొత్త పార్టీ కాదు, పన్నీర్ దెబ్బతో!

|

మదురై/చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్న ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ గురువారం మదురై జిల్లా మేలూరులో అమ్మ మక్కల్ మున్నేట్ర కగజం పార్టీని స్థాపించిన కొన్ని గంటల్లోనే మాటమార్చాడు. తనకు మద్దతు ఇస్తున్న అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల పదవులు కాపాడుకోవడానికి బహిరంగ సభలో మాట్లాడిన టీటీవీ దినకరన్ తరువాత మీడియాతో మరో రకంగా మాట్లాడి తనతెలివితేటలు ప్రదర్శించారు. కొత్తపార్టీ విషయంలో కొన్ని గంటల్లోనే శశికళ ఫ్యామిలీ రివర్స్ గేర్ వేసింది.

రెబల్ ఎమ్మెల్యేలు

రెబల్ ఎమ్మెల్యేలు

మదురై జిల్లాలోని మేలూరులో టీటీవీ దినకరన్ కొత్త పార్టీ అమ్మ మక్కల్ మున్నేట్ర కగజం ఆవిష్కరణ కార్యక్రమానికి, బహిరంగ సభకు అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్ తో సహ అనేక మంది హాజరైనారు.

అసెంబ్లీకి డుమ్మ

అసెంబ్లీకి డుమ్మ

గురువారం తమిళనాడు శాసన సభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నా అసెంబ్లీకి హాజరుకాకుండా ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మదురై జిల్లాలో కొత్త పార్టీ ఆవిష్కరించి వచ్చే ఎన్నికల్లో ఇదే పార్టీ పేరుతో పోటీ చేస్తామని బహిరంగంగా ప్రకటించారు.

స్పీకర్ దెబ్బ!

స్పీకర్ దెబ్బ!

అన్నాడీఎంకే పార్టీ గుర్తుతో గెలిచి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రభుత్వానికి ఎదురుతిరిగారని టీటీవీ దినకరన్ వర్గంలోని ఆ పార్టీకి చెందిన 18 మంది రెబల్ ఎమ్మెల్యేల మీద తమిళనాడు స్పీకర్ ధనపాల్ అనర్హత వేటు వెయ్యడంతో ఆ వివాదం ఇప్పుడు కోర్టులో ఉంది.

మన్నార్ గుడి మాఫియా

మన్నార్ గుడి మాఫియా

టీటీవీ దినకరన్ కొత్త పార్టీ ఆవిష్కరణ కార్యక్రమానికి, బహిరంగ సభకు హాజరైన అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మీద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని మన్నార్ గుడిమాఫియా పసిగట్టింది. రెబల్ ఎమ్మెల్యేల పదవులు పోకుండా టీటీవీ దినకరన్ మాట మార్చాడు.

రాజకీయ పార్టీ కాదు

రాజకీయ పార్టీ కాదు

గురువారం కొత్తపార్టీ ఆవిష్కరించిన తరువాత టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ అమ్మ మక్కల్ మున్నేట్ర కగజం రాజకీయ పార్టీ కాదని, పొరపాటును తాను రాజకీయ పార్టీ అని చెప్పానని, అది ఓ సంస్థ అని మాటమార్చి తెలివితేటలు ప్రదర్శించాడు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం సొంతం చేసుకుంటామని టీటీవీ దినకరన్ చాలెంజ్ చేశారు.

అదే కారణం

అదే కారణం

అన్నాడీఎంకే పార్టీ రెండాకుల గుర్తుతో గెలిచి వేరే పార్టీ గొడగు కింద దర్శనం ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు మీడియా కంటికి చిక్కారు. ఆవీడియోలు, ఫోటోలు తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం న్యాయస్థానంలో సమర్పిస్తారని శశికళ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

అమ్మ ప్రభుత్వానికి పోటి!

అమ్మ ప్రభుత్వానికి పోటి!

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీని అధికారంలోకి తెచ్చిన జయలలిత ప్రభుత్వం మీద తిరుబాటు చేసిన టీటీవీ దినకరన్ విచిత్రంగా ప్రవర్థిస్తున్నాడు. కొత్త పార్టీ జెండాలో జయలలిత ఫోటో ముద్రించారు. కొత్తపార్టీ ఆవిష్కరణ సందర్బంగా జరిగిన బహిరంగ సభ దగ్గర అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత, శశికళ, టీటీవీ దినకరన్ ల భారీ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TTV Dinakaran clarifies that Amma Makkal Munnetra Kazhagam is not a political party, it is an organisation. Till we retrieve back the AIADMK, this organisation acts. Why he clarifies that?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more