వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎత్తులు పైఎత్తులు.. రసవత్తరంగా ఆర్కేనగర్ 'బై పోల్', దినకరన్‌కు దిమ్మ తిరిగేనా?

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఏప్రిల్ 12న ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి
ఏప్రిల్ 12న ఉపఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని అమ్మకు తామే అసలైన వారసులమని నిరూపించుకోవాలనే తపనలో అన్నాడీఎంకె వర్గాలు ఉన్నాయి. మరోవైపు అన్నాడీఎంకె ఎత్తులను చిత్తు చేసేందుకు పన్నీర్ సెల్వం పావులు కదుపుతూనే ఉన్నారు.

అన్నాడీఎంకె తరుపున బరిలో దిగిన ఆ పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ దినకరన్ కు పన్నీర్ ఊహించని షాక్ ఇస్తున్నారు. దినకరన్ గెలుపు కోసం నియోజకవర్గంలో చెమటోడుస్తున్న పలువురిని పన్నీర్ వ్యూహాత్మకంగా తనవైపుకు తిప్పుకున్నారు. దీంతో నియోజకవర్గంలో ఎక్కడ పట్టు సడలిపోతుందోనన్న ఆందోళనలో దినకరన్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఓట్లు చీలిపోయే అవకాశం:

ఓట్లు చీలిపోయే అవకాశం:

జయలలిత మేనకోడలు దీప సైతం బరిలో నిలవడంతో ప్రజలు ఎవరికి పట్టం కడుతారనేది తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం మీద పన్నీర్ వర్గం అభ్యర్థి మధుసూదన్, దినకరన్, దీపల మధ్య ఓట్లు చీలిపోయే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ చీలికలు తమకు లాభిస్తాయని అటు ప్రతిపక్షం డీఎంకె భావిస్తుండటం గమనార్హం.

మధుసూదన్ బలమైన నేత:

మధుసూదన్ బలమైన నేత:

కాగా, పన్నీర్ వర్గం అభ్యర్థి మధుసూదన్ ఆర్కేనగర్ నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్నారు. ఎంజీఆర్ హయాం నుంచి కొనసాగుతున్న నేత కావడంతో.. ఇక్కడి ప్రజలందరికి మధుసూదన్ చాలా దగ్గరయ్యాడనే చెప్పాలి. మధుసూదన్ తో ఉన్న సంబంధాల నేపథ్యంలో చాలామంది అన్నాడీఎంకె కార్యకర్తలు ఆయన వైపు మళ్లుతున్న సంకేతాలు వెలువడుతున్నాయి.

కార్యకర్తలనే నమ్ముకున్న దినకరన్:

కార్యకర్తలనే నమ్ముకున్న దినకరన్:

నియోజకవర్గంలో అన్నాడీఎంకె నేతలైన రాజేష్, జనార్దన్, లలిత, అంజులక్ష్మి, శశి వంటి నాయకులు పన్నీర్ వైపు వెళ్లారు. అయితే ఎంతమంది వెళ్లినా.. కార్యకర్తల అండ మాత్రం తమకు ఉందని దినకరన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాయకుల కన్నా కార్యకర్తలతోనే ఆయన ఎక్కువగా మంతనాలు జరుపుతుండటం గమనార్హం.

శశికళకు ఊరట, ఊహించని దెబ్బా?:

శశికళకు ఊరట, ఊహించని దెబ్బా?:

ఎన్నికల వ్యూహం విషయంలో నాయకుల కన్నా కార్యకర్తలకే పెద్ద పీట వేయడం కలిసొస్తుందని దినకరన్ భావిస్తున్నారు. వారి ద్వారానే పార్టీ జనంలోకి వెళ్లే అవకాశం ఉందనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది.

మొత్తం మీద ఉత్కంఠను రేపుతోన్న ఆర్కేనగర్ ఉపఎన్నికలో అన్నాడీఎంకె విజయం సాధిస్తేనే జైల్లో ఉన్న శశికళకు కాస్త ఊరట అని చెప్పాలి. లేనిపక్షంలో.. జైలుకు వెళ్లినా సరే జనంలో ఆమె పట్ల వ్యతిరేక తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గట్లేదనే సంకేతాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే శశికళకు మరో భారీ షాక్ తగిలినట్లే!

English summary
The bypoll will be an acid test for the ruling faction, which is perceived to lack mass support in the aftermath of developments following Jayalalithaa’s death. With the present general secretary, VK Sasikala imprisoned in a Bengaluru,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X