వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు: గవర్నర్ రాక ముందే దినకరన్ దిమ్మ తిరిగింది!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి దినకరన్ గ్రూప్ లో చేరి కర్ణాటకలోని కొడుగు సమీపంలోని రిసార్ట్ లో ఎంజాయ్ ఎస్తున్న అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడింది. సోమవారం ఉదయం 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు మీద అనర్హత వేటు వేశారు.

సీఎంకు మద్దతు: తమిళనాడు పోలీసు అధికారులు బెదిరిస్తున్నారు: కర్ణాటకలో ఎమ్మెల్యే కేసు!

సోమవారం తమిళనాడు స్పీకర్ ధనపాల్ చెన్నైలోని సచివాలయంలో దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అన్నాడీఎంకే పార్టీ నియమాలు ఉల్లంఘించారని, తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారని స్పీకర్ ధనపాల్ వివరించారు.

TTV Dinakaran faction's 18 MLAs disqualified by Speaker

మూడు సార్లు నోటీసులు ఇచ్చినా 18 మంది ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి స్పందన లేదని, పార్టీ ఆదేశాలు పట్టించుకోలేదని స్పీకర ధనపాల్ వివరించారు. అన్నాడీఎంకే పార్టీ నియమాల ప్రకారం సొంత పార్టీ మీద తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేశామని స్పీకర్ ధనపాల్ స్పష్టం చేశారు

అసెంబ్లీలో పరువు పోకముందే సీఎం పళనిసామి రాజీనామా చెయ్యాలి: తంగ తమిళ్ సెల్వన్!అసెంబ్లీలో పరువు పోకముందే సీఎం పళనిసామి రాజీనామా చెయ్యాలి: తంగ తమిళ్ సెల్వన్!

తమిళనాడు గవర్నర్ (ఇన్ చార్జ్) సీహెచ్. విద్యాసాగర్ రావ్ సోమవారం ముంబై నుంచి చెన్నై రానున్నారు. గవర్నర్ చెన్నై చేరుకోకముందే స్పీకర్ ధనపాల్ టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేల అనర్హత వేటు వేస్తూ సంచనల నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ధనపాల్ నిర్ణయంపై తాము కోర్టుకు వెలుతామని దినకరన్ వర్గం నాయకులు అంటున్నారు.

English summary
TTV Dinakaran faction's 18 MLAs disqualified by Speaker because of they failed to give reply for notice.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X