చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎంపీలు జంప్, దినకరన్ బెంగళూరుకు పరుగో పరుగు, జైల్లో శశికళతో, ఆర్ కే నగర్ లో !

అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ తమిళనాడు ప్రభుత్వం మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.

|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ తమిళనాడు ప్రభుత్వం మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. జయలలిత ప్రాతినిథ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయిన ఆర్ కే నగర్ నియోజక వర్గం ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యాలని టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నాడు.

అమ్మ జయలలిత ఏ రోజు, ఎన్ని గంటలకు మరణించారు? హైకోర్టులో, స్టే ఇవ్వండి!అమ్మ జయలలిత ఏ రోజు, ఎన్ని గంటలకు మరణించారు? హైకోర్టులో, స్టే ఇవ్వండి!

తమ వర్గంలోని ఐదు మంది ఎంపీలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గంలో చేరిపోవడంతో టీటీవీ దినకరన్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఎలాగైనా మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు జంప్ కాకుండా చూడాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

TTV Dinakaran rushes to Bengaluru to meet Sasikala Natarajan

బుధవారం టీటీవీ దినకరన్ బెంగళూరు చేరుకున్నాడు. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళతో చర్చించి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటూ చర్చలు జరపడానికి టీటీవీ దినకరన్ ప్రయత్నిస్తున్నాడు.

జయలలికు కుమార్తె ఉన్న మాట నిజమే: 1980లో, ఎవరు అనేది, బాంబుపేల్చిన లలిత !జయలలికు కుమార్తె ఉన్న మాట నిజమే: 1980లో, ఎవరు అనేది, బాంబుపేల్చిన లలిత !

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై టీటీవీ దినకరన్ శశికళ అనుమతి తీసుకోవాలని నిర్ణయించాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గం చేతికి వెళ్లిన సందర్బంలో శశికళ ఎలా స్పంధిస్తారు ?, ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో దినకరన్ పోటీ చెయ్యడానికి అంగీకరిస్తారా ? లేదా ? అనే విషయం వేచిచూడాలని ఆమె వర్గీయులు అంటున్నారు.

English summary
Amid exodus of MPs to the ruling All India Anna Dravida Munnetra Kazhagam and ahead of RK Nagar by-poll, rebel AIADMK leader TTV Dhinakaran on Wednesday left for Bengaluru to meeet his aunt and the party's expelled general secretary Sasikala Natarajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X