నేడు టీటీవీ దినకరన్ బహిరంగ సభ, ఎంత మంది ఎమ్మెల్యేలు, టెన్షన్ తో సీఎం !
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ)లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్న శశికళ సొదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ (అమ్మ)లో చక్రం తిప్పాలని ప్రయత్నాలు చేస్తున్న శశికళ సొదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ తన సత్తా చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మదురైకి 28 కిలోమీటర్ల దూరంలోని మేలూరులో సోమవారం జరగనున్న బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
సోమవారం జరగనున్న దినకరన్ బహిరంగ సభకు భారీ జన సమీకరణ లక్షంగా ఆయన మద్దతుదారులు ఉరకలు తీస్తున్నారు. భారీ జన సమీకరణతో తన సత్తా చాటుకోవాలని దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్బంలో దినకకరన్ బహిరంగ సభకు ఎంత మంది ఎమ్మెల్యేలు హాజరవుతారో అనే విషయం వేచి చూడాలి.

బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళ సైతం దినకరన్ బహిరంగ సభకు కార్యకర్తలను తరలించాలని తన మద్దతుదారులకు సూచించారని తెలిసింది. దినకరన్ బహిరంగ సభకు ఎంత మంది ఎమ్మెల్యేలు హాజరౌతారు ? అంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మదురై జిల్లాలోని మేలూరులో తన బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని టీటీవీ దినకరన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించి చివరికి అనుమతి తీసుకున్నారు. తన బహిరంగ సభ విజయవంతం అయితే తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి సినిమా చూపించాలని దినకరన్ అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది ఎంత వరకు సాధ్యం ? అనే విషయం వేచిచూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.












Click it and Unblock the Notifications