వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు సీఎం నేను కాదు, త్యాగం చేసిన వారే: టీటీవీ దినకరన్, పళని, పన్నీర్ కు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా కొత్త అభ్యర్థిని తెర మీదకు తెస్తామని, త్వరలోనే ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వం కుప్పకూలిపోతుందని అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు, ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ జోస్యం చెప్పారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రి పదవి తనకు వద్దని టీటీవీ దినకరన్ చెప్పారు.

తమిళనాడు టూర్

తమిళనాడు టూర్

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తమిళనాడు ప్రభుత్వం, ప్రతిపక్ష డీఎంకే పార్టీకి చుక్కలు చూపించిన టీటీవీ దినకరన్ మంచి జోరుమీద ఉన్నారు. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి టీటీవీ దినకరన్ తమిళనాడు పర్యటన చేస్తున్నారు.

 కార్యకర్తలతో భేటీ

కార్యకర్తలతో భేటీ


తమిళనాడులోని కతిరమంగళంలో మంగళవారం టీటీవీ దినకరన్ ఆయన వర్గం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అమ్మ జయలలిత కోరుకున్న ప్రభుత్వం ప్రస్తుతం తమిళనాడులో లేదని, అవినీతి ప్రభుత్వం ఉందని టీటీవీ దినకరన్ ఆరోపించారు.

త్యాగం చేశారు, సీఎం చేస్తా

త్యాగం చేశారు, సీఎం చేస్తా

తమిళనాడులోని పళనిస్వామి అవినీతి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసిన 18 మంది నిజాయితీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేశారు, కోర్టు తీర్పు వచ్చిన వెంటనే పదవులు త్యాగం చేసిన అదే 18 మందిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తానని టీటీవీ దినకరన్ శపథం చేశారు.

టీటీవీ దినకరన్ సీఎం

టీటీవీ దినకరన్ సీఎం

అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యే తంగ తమిళ సెల్వన్ మీడియాతో మాట్లాడుతూ కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎడప్పాడి పళనిస్వామి వర్గంలోని అసమ్మతి ఎమ్మెల్యేలను కలుపుకుని ఆయన పళనిస్వామి ప్రభుత్వాన్ని గద్దెదించి టీటీవీ దినకరన్ ను సీఎం చేస్తామని తంగ తమిళ సెల్వన్ మీడియాకు చెప్పారు.

డీఎంకేతో దోస్తీకి సై

డీఎంకేతో దోస్తీకి సై


18 మంది తిరుబాటు ఎమ్మెల్యేలు అవసరం అయితే డీఎంకే పార్టీతో కలిసి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్లాన్ వేస్తున్నారు. మొత్తం మీద ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వంను ఇంటికి పంపించే వరకూ తాము నిద్రపోమని చాలెంజ్ చేస్తున్నారు.

English summary
TTV Dinakaran says in Kathirmangalam and says that he never wants to become CM of TamilNadu. He will select the CM one of 18 those who sacrifice their MLA post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X