వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మాహాత్మగాంధీ మనుమడు కాదు, దేశంలో ఎవరు తప్పు చెయ్యలేదు, టీటీవీ దినకరన్ !

ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శశికళ కుటుంబ సభ్యులు పైకి మాత్ర మాకేం భయం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్న సమయంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శశికళ కుటుంబ సభ్యులు పైకి మాత్ర మాకేం భయం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. చట్టప్రకారం తాము ఆదాయపన్ను చెల్లించినా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఐటీ శాఖ అధికారులను అడ్డం పెట్టుకుని దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మోడీ, పళని ప్లాన్: రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే ఐటీ దాడులు, జైలు కొత్తకాదు, దినకరన్!మోడీ, పళని ప్లాన్: రాజకీయాల్లో లేకుండా చెయ్యాలనే ఐటీ దాడులు, జైలు కొత్తకాదు, దినకరన్!

శనివారం చెన్నైలో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ దేశంలో తప్పు చెయ్యని వారు ఎవరైనా ఉన్నారా ? అని ప్రశ్నించారు. నేను మాహాత్మాగాంధీ మనుమడు కాదని, అలాగని తనను వేలేత్తి చూపిస్తున్న వారు నిజాయితీపరులు కాదని అన్నారు.

 TTV Dinakaran says that he is not Gandhi's grand son

తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం అవినీతిని వేలేత్తి చూపించినందుకే మా కుటుంబ సభ్యుల మీద ఆదాయపన్ను శాఖను అడ్డంపెట్టుకుని దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని టీటీవీ దినకరన్ జోస్యం చెప్పారు.

ఐటీ షాక్: శశికళ ఫ్యామిలీలో రూ. కోట్ల విలువైన పత్రాలు సీజ్, జయలలితను అడ్డం పెట్టుకుని!ఐటీ షాక్: శశికళ ఫ్యామిలీలో రూ. కోట్ల విలువైన పత్రాలు సీజ్, జయలలితను అడ్డం పెట్టుకుని!

ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కు అయ్యారని, దాని ఫలితంగానే శశికళ కుటుంబ సభ్యుల మీద వేధింపులు ఎక్కువ అయ్యాయని టీటీవీ దినకరన్ ఆరోపించారు. ఆదాయపన్ను శాఖ అధికారుల సోదాల్లో ఎలాంటి అక్రమాస్తులు బయటపడలేదని, చట్టపరంగానే మేము వ్యాపారాలు చేస్తున్నామని టీటీవీ దినకరన్ సమర్థించుకున్నారు.

English summary
TTV Dinakaran says that he is not Gandhi's grand son and at the same time the others who are accusing us are also not Good guys
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X