వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పళనిసామి పదవికే ఎసరు: దినకరన్ దూకుడు: 20 మంది జంప్, మంత్రులపై వేటు !

అన్నాడీఎంకే (అమ్మ) శిభిరంలో టీటీవీ దినకరన్ స్వరం జోరుగానే పెరుగుతోంది. అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు నిలిచారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే (అమ్మ) శిభిరంలో టీటీవీ దినకరన్ స్వరం జోరుగానే పెరుగుతోంది. అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు మద్దతుగా 20 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. 20 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ టీటీవీ దినకరన్ ను సీఎం చెయ్యాలని బహిరంగంగా డిమాండ్ చేశారు.

<strong>అన్నాడీఎంకేలో మూడుముక్కలాట: ఆట మొదలు పెట్టిన దినకరన్, మళ్లీ ఏం చేస్తాడో ?</strong>అన్నాడీఎంకేలో మూడుముక్కలాట: ఆట మొదలు పెట్టిన దినకరన్, మళ్లీ ఏం చేస్తాడో ?

పార్టీ పదవి, సీఎం పదవి ఒక్కరికే ఇవ్వాలని నినాదం చేస్తున్నారు. టీటీవీ దినకరన్ సీఎంగా పని చెయ్యడానికి అర్హత ఉందని, ఆయనకే పార్టీ పదవితో పాటు ముఖ్యమంత్రి పదవి అప్పగించాలని ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ దెబ్బతో టీటీవీ దినకరన్ ప్రభుత్వంపై పట్టుసాధించాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని మరో సారి వెలుగు చూసింది.

వచ్చేశాను, ఇక పార్టీలో !

వచ్చేశాను, ఇక పార్టీలో !

ఎన్నికల కమిషన్ కు రూ. 50 కోట్లు లంచం ఎర వేశారని ఆరోపణలు ఎదుర్కొంటు అరెస్టు అయిన టీటీవీ దినకరన్ తీహార్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలైనాడు. చెన్నైలో అడుగు పెట్టిన టీటీవీ దినకరన్ దూకుడు మీద ఉన్నాడు. తాను వచ్చేశానని, ఇక మీద పార్టీ కార్యకలాపాల మీద దృష్టిపెడుతానని అంటున్నాడు.

బహిష్కరించాం, ఇక ఏం పని ఉంది ?

బహిష్కరించాం, ఇక ఏం పని ఉంది ?

టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించామని, ఇక ఆయనకు పార్టీలో ఏం పని ఉందంటూ ఎడప్పాడి పళనిసామి వర్గంలోని కొందరు ఎమ్మెల్యేలు అంటున్నారు. నెల క్రితం టీటీవీ దినకరన్ ను పార్టీ నుంచి బహిష్కరించాం అంటూ చాల మంది ఎమ్మెల్యేలు స్వరం పెంచుతున్నారు.

మీరెవరు బహిష్కరించడానికి !

మీరెవరు బహిష్కరించడానికి !

తనను పార్టీ నుంచి బహిష్కరించే అధికారం ఒక్క శశికళకు మాత్రమే ఉందని, మీరెవరు నన్ను బహిష్కరించడానికి అంటూ టీటీవీ దినకరన్ ప్రశ్నిస్తున్నారు. పార్టీ కార్యకలాపాలు తాను చూసుకుంటాను అంటున్నారు. నేను అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి అంటూ సంకలు గుద్దుకుంటున్నారు.

పళనిసామికి వ్యతిరేకంగా !

పళనిసామికి వ్యతిరేకంగా !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యేలు ఇప్పుడు టీటీవీ దినకరన్ గొడుగు కిందకు చేరుకుంటున్నారు. ఇప్పటికే 20 మంది ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ కు మద్దతు తెలిపారు. దినకరన్ కు మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరుగుతోందని ఆయన వర్గీయులు అంటున్నారు.

పళనిసామి కుర్చీకి ఎసరు ?

పళనిసామి కుర్చీకి ఎసరు ?

దినకరన్ కు మద్దతు ఇస్తున్న వారిలో ఎమ్మెల్యేలు తంగ తమిళ్ సెల్వన్, బోసు, సుబ్రమణియన్, ఎంపీ నాగరాజ్ అయితే ఏకంగా పళనిసామికి వ్యతిరేకంగా బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సీఎం పళనిసామి వెంటనే రాజీనామా చేసి దినకరన్ కు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

నలుగురు మంత్రులపై వేటు !

నలుగురు మంత్రులపై వేటు !

టీటీవీ దినకరన్ కు వ్యతిరేకంగా మొదటి నుంచి స్పందిస్తున్న నలుగురు మంత్రులను వెంటనే పదవి నుంచి తప్పించాలని ఎమ్మెల్యేలు తంగ తమిళ్ సెల్వన్, బోసు, సుబ్రమణియన్, ఎంపీ నాగరాజ్ డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు సెంగోట్టయన్, జయకుమార్, తంగమణి, వేలుమణి లను తప్పించాలని డిమాండ్ చేయ్యడం కొసమెరుపు.

నోటికి తాళం వేసిన డిప్యూటీ స్పీకర్

నోటికి తాళం వేసిన డిప్యూటీ స్పీకర్

తమిళనాడు మంత్రులను తప్పించాలని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్యేల నోటికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తాళం వేశారు. పార్టీ, సీఎం పదవి ఒక్కరికే ఇవ్వాలి అనే విషయం గతంలో ఉండేదని అన్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తంబిదురై చెబుతున్నారు.

జయలలితకు మాత్రమే ఆ చాన్స్ !

జయలలితకు మాత్రమే ఆ చాన్స్ !

పార్టీ పగ్గాలు, సీఎం పదవి జయలలిత చేతిలో ఉన్న సమయంలో ఆనందించామని, తరువాత చిన్నమ్మ వస్తారని ఎదురు చూశామని, అది జరగలేదని తంబిదురై అన్నారు. ఇప్పుడు మాత్రం ఆచాన్స్ ఎవ్వరికీలేదని, సీఎం పళనిసామి చక్కగా పని చేస్తున్నారని లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై కితాబు ఇచ్చారు.

గొడ మీద దీపం పెట్టారు !

గొడ మీద దీపం పెట్టారు !

తమిళనాడు మంత్రులు జయకుమార్. సెంగోట్టయన్, తంగమణి, ఎస్ పీ. వేలుమణిని తప్పించాలని కొందరు ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్ ను లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై పరోక్షంగా వ్యతిరేకించారు. ఎవరికి తొచినట్లు వారు చెబుతున్న మాటలు వింటే ఏమీ చెయ్యలేమని అంటున్నారు. లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై దినకరన్ కు మద్దతు ఇస్తున్నారా ? పళనిసామికి మద్దతు ఇస్తున్నారా ? అనే విషయం అర్థం కాక కొందరు ఎమ్మెల్యేలు జట్టు పీక్కుంటున్నారు.

English summary
After TTV Dinakaran's release his supporters awaiting with the expectations of what will be the action against minister Thangamani and Velumani.Even there is a danger to Jayakumar's minister post also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X