వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వం: గవర్నర్ కు లేఖ ఇచ్చిన 19 మంది ఎమ్మెల్యేలు !

తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను కలిశారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మైనారిటీలో పడింది. టీటీవీ దినకరన్ గ్రూప్ లోని 19 మంది ఎమ్మెల్యేలు మంగళవారం రాజ్ భవన్ లో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను కలిశారు. గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో మాజీ మంత్రులు తోపు వెంకటాచలం, సెంథిల్ బాలాజీ తదితరులు చర్చించారు.

గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో దినకరన్ గ్రూప్ 19 మంది ఎమ్మెల్యేలు భేటీ, టెన్షన్ టెన్షన్ !గవర్నర్ విద్యాసాగర్ రావ్ తో దినకరన్ గ్రూప్ 19 మంది ఎమ్మెల్యేలు భేటీ, టెన్షన్ టెన్షన్ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని 19 మంది ఎమ్మెల్యేలు కలిసి గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ కు లేఖ ఇచ్చారు. సీఎం ఎడప్పాడి పళనిసామి శాసన సభలో బలపరీక్ష నిరూపించుకోవాలని ఆదేశించాలని గవర్నర్ విద్యాసాగర్ రావ్ కు మనవి చేశారు.

TTV dinakaran support MLAs withdraw their support CM EPS

గవర్నర్ విద్యాసాగర్ రావ్ ను కలిసిన తరువాత టీటీవీ దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ నుంచి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. టీటీవీ దినకరన్ ముఖ్య అనుచరుడు తంగ తమిళ్ సెల్వన్ మీడియాతో మాట్లాడుతూ సీఎం ఎడప్పాడి పళనిసామి మీద విరుచుకుపడ్డారు.

పన్నీర్, పళని ఒకే కారులో అమ్మ సమాధి దగ్గరకు: సినిమా చూపిస్తా, శశికళల బ్రదర్ !పన్నీర్, పళని ఒకే కారులో అమ్మ సమాధి దగ్గరకు: సినిమా చూపిస్తా, శశికళల బ్రదర్ !

తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామికి పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యే ఎందుకు మద్దతు ఇచ్చారని, అంత అవసరం ఏమీ వచ్చిందని ప్రశ్నించారు. ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం కలిసి డ్రామాలు ఆడుతున్నారని, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని తంగ తమిళ్ సెల్వన్ జోస్యం చెప్పారు.

TTV dinakaran support MLAs withdraw their support CM EPS

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి శాసనసభలో పూర్తి మెజారిటీ నిరూపించుకోవడానికి బలపరీక్షకు సిద్దం కావాలని, ఆ తరువాత ఆయన ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనాలని తమిళనాడులో ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు. ఢిల్లీ పెద్దలు ఆడిస్తున్నట్లు ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఆడుతున్నారని స్టాలిన్ ఎద్దేవ చేశారు.

English summary
TTV Dinakaran Camp 19 MLAs withdraw their support to the Chief Minister Edappaadi Palanisamy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X