వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పెద్దలతో పన్నీర్, పళని చర్చలు: ఎమ్మెల్యేలు కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఏం చేస్తారు ?

తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసరంగా సమావేశం అయ్యారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మైనారిటీలో పడిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అత్యవసరంగా సమావేశం అయ్యారు. టీటీవీ దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలను ఎలాగైనా తమ దారిలోకి తెచ్చుకోవాలని ప్లాన్ వేస్తున్నారు.

దినకరన్ అనుచరుల దుమ్ములేపిన ఎంపీ వర్గం, నిన్నే బహిష్కరించారు, ఇక నన్ను !దినకరన్ అనుచరుల దుమ్ములేపిన ఎంపీ వర్గం, నిన్నే బహిష్కరించారు, ఇక నన్ను !

బుధవారం తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, పలువురు మంత్రులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి చర్చలు జరిపారు. శాసన సభలో ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాలంటే దినకరన్ గ్రూప్ లోని ఐదు మంది ఎమ్మెల్యేలను బయటకు తీసుకురావాలి.

TTV Dinakaran supporting MLAs halted at Puducherry resort

దినకరన్ వర్గంలోని ఐదు మంది ఎమ్మెల్యేను బయటకు రప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు ఎమ్మెల్యేలు గొడ దూకకుండా దినకరన్, మన్నార్ గుడి మాఫియా జాగ్రత్తలు తీసుకుంటోంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.

డీఎంకే మద్దతు కోరుతున్న మన్నార్ గుడి: స్టాలిన్ సహాయంతో పళని, పన్నీర్ ప్రభుత్వానికి చెక్ !డీఎంకే మద్దతు కోరుతున్న మన్నార్ గుడి: స్టాలిన్ సహాయంతో పళని, పన్నీర్ ప్రభుత్వానికి చెక్ !

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న పుదుచ్చేరి నుంచి దినకరన్ గ్రూప్ ఎమ్మెల్యేలను బయటకు రప్పించడం వీలుకాకపోవడంతో తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఢిల్లీలోని కొందరు పెద్దలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఢిల్లీలోని పెద్దల సహకారంతో దినకరన్ గ్రూప్ లోని ఎమ్మెల్యేలను తమ దారిలోకి తెచ్చుకోవాలని పళనిసామి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

English summary
TTV Dinakaran supporting MLAs halted at Puducherry resort the wind flower, again remebering the days of Koovathur golden bay resort.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X