• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Lockdown: 12 ఏళ్ల అబ్బాయిని నెల రోజులు రేప్ చేసిన ట్యూషన్ టీచర్, ఆన్ లైన్ పాఠాలు, అయితే!

|

అహమ్మదాబాద్ (గుజరాత్): కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో దేశంలో అక్కడక్కడా విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. లాక్ డౌన్ దెబ్బకు విద్యాసంస్థలు పూర్తిగా మూసివేశారు. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాస్ లు జరుగుతున్నాయి. తమ కుమారుడు ఆన్ లైన్ క్లాస్ లతో పాటు ఇంకా అన్ని విద్యలు నేర్చుకోవాలని తల్లిదండ్రులు ఆశపడ్డారు. అంతే నెల క్రితం ఓ ట్యూషన్ టీచర్ ను తమ కొడుక్కి పాఠాలు చెప్పాలని మనవి చేశారు. అయితే 12 ఏళ్ల బాలుడిపై నెల రోజుల నుంచి పదేపదే అత్యాచారం చెయ్యడంతో ఆ అబ్బాయి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు షాక్ కు గురైనారు.

Mafia Don: దేశాన్ని గడగడలాడించి కుక్కచావు, ఫ్రెండ్ భార్యపై మోజు, స్వర్గం చూపించింది, పక్కాప్లాన్ తో

మా బిడ్డ బాగాచదవాలి!

మా బిడ్డ బాగాచదవాలి!

గుజరాత్ లోని అహమ్మదాబాద్ జిల్లాలో నివాసం ఉంటున్న తల్లిదండ్రులకు 12 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కరోనా వైరస్ దెబ్బకు లాక్ డౌన్ విధించడంతో విద్యాసంస్థలు మూసివేశారు. బాలుడు చదువుతున్న ప్రసిద్ది చెందిన స్కూల్ యాజమాన్యం సూచన మేరకు ఆ పాఠశాల టీచర్లు విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాస్ లు చెబుతున్నారు. మా బిడ్డ బాగాచదవాలని బాలుడి తల్లిదండ్రులు ఆశపడ్డారు.

ట్యూషన్ టీచర్

ట్యూషన్ టీచర్

12 ఏళ్ల బాలుడు చదువుతున్న స్కూల్ లో అహమ్మదాబాద్ జిల్లాలోని తల్తేజ్ తాలుకాలో నివాసం ఉంటున్న పార్థ్ బారోట్ (21) అనే యువకుడు టీచర్ గా పని చేస్తున్నాడు. చూడటానికి అమ్మాయిలా లావుగా, ఎర్రగా ఉంటున్న 12 ఏళ్ల బాలుడి మీద టీచర్ పార్థ్ బారోట్ కు చాలాకాలంగా కన్ను పడింది. ఇదే సమయంలో బాలుడి కుటుంబ సభ్యులు మా ఇంటికి వచ్చి మా అబ్బాయికి ట్యూషన్ చెప్పాలని, మీరు అడిగినంత డబ్బులు ఇస్తామని పార్థ్ బారోట్ కు మనవి చేశాడు.

నెల నుంచి గదిలో అదే పని

నెల నుంచి గదిలో అదే పని

గత నెల రోజుల నుంచి బాలుడి ఇంటికి పార్థ్ బారోట్ వచ్చి వెలుతున్నాడు. అయితే గదిలో బాలుడికి పాఠాలతో పాటు అతనికి సెక్స్ పాఠాలు చెప్పాడు. బాలుడిపై బలవంతంగా లైంగికదాడి చేశాడు. గత నెల రోజుల నుంచి పదేపదే టీచర్ పార్థ్ బారోడ్ అబ్బాయిపై అత్యాచారం చేసి అతని కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ విషయం బయటకు చెబితే తాను నీపేరు రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుంటానని, తరువాత నువ్వు జైలుకు వెలుతావని బాలుడిని టీచర్ పార్థ్ బారోట్ భయపెట్టాడు.

ఏం జరిగిందని ఆరా తీస్తే షాక్

ఏం జరిగిందని ఆరా తీస్తే షాక్

తన మీద అత్యాచారం జరిగిందని బయటకు చెబితే తన టీచర్ ఆత్మహత్య చేసుకుంటాడని, తాను జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని బాలుడు చాలా భయపడిపోయాడు. 15 రోజుల నుంచి బాలుడు అనారోగ్యానికి గురైనాడు. బాలుడికి కడుపునొప్పి ఎక్కువైయ్యింది. బాలుడిని ఓ వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఆ డాక్టర్ కు అనుమానం వచ్చి బాలుడి శరీరం మొత్తం పరిశీలించాడు. అనుమానం వచ్చి బాలుడిని ఏం జరిగిందని ఆ డాక్టర్ పదేపదే గుచ్చిగుచ్చి అడగడంతో తన మీద ట్యూషన్ టీచర్ అత్యాచారం చేశాడని బాలుడు అసలు విషయం చెప్పాడు.

  Fact Check : No Lockdown In Vijayawada - Collector || Oneindia Telugu
  ఐపీసీ 377 సెక్షన్ దెబ్బతో ఫినిష్

  ఐపీసీ 377 సెక్షన్ దెబ్బతో ఫినిష్

  బాలుడి కుటుంబ సభ్యులు సోలా పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి కామాంధుడైన టీచర్ పార్థ్ బారోడ్ ను అరెస్టు చేశాడు. టీచర్ పార్థ్ బారోడ్ మీద అసహజ శృంగారంలో పాల్గొన్నాడని ఐపీసీ 377 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని సోలా పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ జేపీ. జేడేజా మీడియాకు ( టైమ్స్ ఆఫ్ ఇండియా) చెప్పారు.

  English summary
  Lockdown Rape: A 12-year-old boy was repeatedly sodomised allegedly by his tuition teacher in Ahmedabad district of Gujarat.The accused has been identified as 21-year-old Parth Barot, a resident of Thaltej taluka. A complaint has been filed against the accused at Sola police station.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X