వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడుకు కోసం: 6 నెలలుగా సైకిల్‌పై 1500 కి.మీ అన్వేషణ

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో కన్పించకుండా పోయిన తన 11 ఏళ్ళ కొడుకు కోసం ఓ నిరుపేద రైతు సతీష్ చంద్ సైకిల్‌పై ఊరూరా తిరుగుతున్నారు. ఇప్పటికే సుమారు 1500 కి.మీ. వెతికారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా సమీపంలోని ఎత్మద్‌పూర్ పరిసర ప్రాంతాల్లో కొడుకు కోసం ఆయన వెతుకుతున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హథారస్‌ జిల్లా ద్వారికాపూర్‌లో 48 ఏళ్ల సతీశ్‌ చంద్‌ కొడుకు గోడ్నా జూన్‌ 24న స్కూలుకెళ్లి∙ తిరిగి రాలేదు. స్కూలు సిబ్బందిని అడిగితే సమాధానం లేదు.

అయితే రైల్వే స్టేషన్‌లో చివరిసారిగా చూశామని అతడి స్నేహితులు చెప్పారు. కానీ, ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కొడుకు కోసం సతీష్ చంద్ ఐదు మాసాలుగా వెతుకుతున్నాడు.

కొడుకు కోసం ఐదేళ్ళుగా సతీష్‌చంద్ గాలింపు

కొడుకు కోసం ఐదేళ్ళుగా సతీష్‌చంద్ గాలింపు

స్కూల్‌కు వెళ్ళి కన్పించకుండా పోయిన 11 ఏళ్ళ తన కొడుకు గోడ్నా కోసం సతీష్ చంద్ విస్తృతంగా గాలిస్తున్నాడు. జూన్ 24న, స్కూల్‌కు వెళ్ళిన గోడ్నా ఇంటికి తిరిగి రాలేదు.అయితే ఆ రోజు నుండి కొడుకు కోసం ఆయన గాలిస్తున్నాడు. సైకిల్‌పై ఇప్పటికే 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశాడు. చేతిలో ఫోటోను పెట్టుకొని తన కొడుకు ఆచూకీ చెప్పాలని గ్రామాలు తిరుగుతున్నాడు.

ఫిర్యాదు తీసుకొని పోలీసులు

ఫిర్యాదు తీసుకొని పోలీసులు

తన కొడుకు తప్పిపోయాడని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని సతీష్‌చంద్ అభిప్రాయపడ్డారు.జూన్‌లో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్తే వారు ఫిర్యాదు స్వీకరించలేదు. బతిమాలిన తర్వాత తీసుకున్నారు. వారేదో చేస్తారని నేను వేచి చూస్తే గోడ్నా నాకు దక్కడని అర్థమైంది. దీంతో నేనే వెతుకులాట సాగించాను. సైకిల్‌పై తిరుగుతూ కనిపించిన వారినల్లా ఈ ఫొటోలో అబ్బాయిని ఎక్కడైనా చూశారా అని అడుగుతున్నానని సతీష్‌చంద్ చెప్పారు.

చాలా గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేదు

చాలా గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేదు

నా దగ్గర కొంచెం డబ్బు మాత్రమే ఉంది. నాకెవరూ తెలియదు. నా లాంటి వాళ్లకు ఎవరు సహాయం చేస్తారు అంటూ ఆవేదన చెందాడు. ఇప్పటివరకు 1,500 కిలోమీటర్ల మేర తిరిగానని, గోడ్నా జాడ తెలియరాలేదని చెప్పాడు. వందలాది గ్రామాల్లో తిరిగి, వేలాది మందిని అడిగానని తెలిపాడు.

బాలల హక్కుల కార్యకర్తల చొరవ

బాలల హక్కుల కార్యకర్తల చొరవ

సతీష్‌చంద్ తన కొడుకు కోసం 6 మాసాలుగా వెతుకుతున్న పరిస్థితి బాలల హక్కుల కార్యకర్త నరేశ్‌ పరాస్‌ వరకు వెళ్లింది. ఆయన చొరవ తీసుకుని ట్వీటర్‌ ద్వారా యూపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సాయంత్రానికల్లా వెంటనే చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. అలాగే యూపీ ముఖ్యమంత్రి ప్రారంభించిన జన్‌సున్‌వాయ్‌ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేశారు.

పిల్లలను కోల్పోయి

పిల్లలను కోల్పోయి

నా పెద్ద కూతురు సరిత 2005లో అనారోగ్యంతో చనిపోయింది. 2011లో జరిగిన ప్రమాదంలో 9 ఏళ్ల కొడుకును కోల్పోయాను. గోడ్నా లేకుండా ఎలా బతకాలో తెలియడం లేదని సతీష్‌చంద్ వాపోయాడు. కరపత్రాలు పంచుతున్నానని, తిరిగిన ప్రతి చోట, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్ల వద్ద చాయ్‌వాలాలు, దుకాణదారుల నంబర్లు తీసుకున్నానని చెబుతున్నాడు.

English summary
Satish Chand, a 48-year-old farmer from Hathras district, has been on his bicycle for five months now, looking for his 11-year-old disabled son who suddenly went missing six months ago. With no help from the UP police, whom he had approached as soon as his child had disappeared, he is still on the road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X