వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేకలను పట్టించుకోని జనం: రేప్ నుంచి తప్పించుకున్న టీవీ నటి

By Pratap
|
Google Oneindia TeluguNews

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ టీవీ నటి తనపై జరిగిన అత్యాచార యత్నం నుంచి తప్పించుకుంది. ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో ఇంటి వద్దనే ఆమెపై దుండగులు అత్యాచార యతానికి ప్రయత్నించారు. తనపై అత్యాచారం యత్నం జరుగుతున్న సమయంలో కొంత మంది అక్కడ ఉన్నారని, తాను కేకలు వేసినా వారు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అయితే, 34 ఏళ్ల ఆ టెలీ సీరియల్ నటి మొబైల్ ఫోన్‌ను లాక్కుని దుండగుడు పారిపోయాడు. తనపై జరిగిన అత్యాచార యత్నంపై, చోరీపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార యత్నం కింద పోలీసులు కేసు నమోదు చేసుకోవడానికి నిరాకరించడం పట్ల ఆమె తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసింది.

TV actress molested, passersby ignore cries

ఆమె చెప్పిన వివరాల ప్రకారం - టాలీగుంగే స్టూడియోలో షూటింగ్ ముగిసిన తర్వాత ఆమె ఉదయం ఒంటి గంటా 40 నిమిషాల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చింది. డ్రైవర్ ఆమెను ఇంటి ప్రధాన ద్వారం వద్ద దించేసి, వెళ్లిపోయాడు. గేటు తాళం తీయడానికి ప్రయత్నిస్తుండగా ఆమెను ఓ వ్యక్తి వెనక నుంచి గట్టిగా లాగాడు. ఆమె పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించాడు. తనపై దాడి చేస్తాడని ఆమె భయపడింది. ఆమె కేకలు వేసినప్పటికీ అక్కడున్నవారు చూస్తూ ఊరుకున్నారే తప్ప సాయానికి రాలేదు.

ఆమె అతని నుంచి విడిపించుకుని పోలీసులకు సమాచారం అందించడానికి ఎమర్జెన్సీ నెంబర్ డయల్ చేసింది. దాంతో అతను మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయాడు. చివరకు ఆమె లాల్ బజార్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించింది. దాంతో ఐదు నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ పోలీసులు చోరీ జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదంటూ మరో పోలీసు స్టేషన్‌కు కేసును అప్పగించారు. అత్యాచార యత్నం, చోరీ కింద కేసులు నమోదున చేశామని పోలీసులు చెబుతున్నారు.

English summary
A tele-serial actress survived a rape attempt right in front of her house in south Kolkata after she returned from work on Sunday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X