చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Loafer: టీవీ రిపోర్టర్ ఫ్యామిలీ స్కెచ్, అమ్మాయిపై 400 మంది లైంగిక దాడి కేసులో ట్విస్ట్, వాడే కింగ్ పిన్, నరాలు కట్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ బెంగళూరు: 15 ఏళ్ల అమ్మాయిపై మీద 400 మందికి పైగా అత్యాచారం, లైంగిక దాడి చేశారని వెలుగు చూసిన కేసు ఊహించని మలుపు తిరిగింది. ఓ ప్రైవేట్ టీవీ చానల్ రిపోర్టర్ తన జీవితం నాశనం కావడానికి కారణం అయ్యాడని బాధితురాలు మొదట అతని పేరు చెప్పి ఫోటోలు గుర్తించడంతో కలకలం రేపింది. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో ఇలాంటి దారుణం జరడంతో తమిళ ప్రజలు షాక్ అయ్యారు. అమాయకురాలైన అమ్మాయి మీద అత్యాచారం, లైంగిక దాడి చేసిన వారిలో పోలీసు ఇన్స్ పెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, పొలిటికల్ లీడర్స్, వీఐపీలు ఉన్నారని ఆరోపణలు రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ఆంటీలు, ఓ టీవీ చానల్ రిపోర్టర్ ఫ్యామిలీ స్కెచ్ తో అమ్మాయిపై జరిగిన అత్యాచారం కేసును ఉన్నతస్థాయి పోలీసు అధికారులు విచారణ ముమ్మరం చేశారు.

Lady inspector: మేడమ్ ముట్టుకుంటే రూ. లక్ష, టచ్ చేస్తే రూ. 30 వేలు, నల్లతంబికి మండింది, అంతే!Lady inspector: మేడమ్ ముట్టుకుంటే రూ. లక్ష, టచ్ చేస్తే రూ. 30 వేలు, నల్లతంబికి మండింది, అంతే!

అమ్మాయి అక్కతో సమస్య

అమ్మాయి అక్కతో సమస్య

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని వాషర్ మెన్ పేట్ లో 15 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. ఈ అమ్మాయి అమాయకురాలు. అమ్మాయి అక్క వడ్డీకి డబ్బులు తీసుకుని ఆ డబ్బులు చెల్లించకపోవడంతో అక్కడ సమస్య మొదలైయ్యింది. అమాయకురాలైన అమ్మాయి మీద అనేక మంది కామాంధుల కన్ను పడింది. అమ్మాయికి పరిచయం ఉన్న షకీరా బాను అనే మహిళ ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యాలని కొందరితో కలిసి పక్కా స్కెచ్ వేసింది.

దెబ్బకు దిమ్మతిరిగిపోయింది

దెబ్బకు దిమ్మతిరిగిపోయింది


భాదితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన చెన్నై సిటీ పోలీసు అధికారులు అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిన షకీరా బానుతో పాటు సంధ్య, మదన్ కుమార్, ఎన్ఆర్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ పూహళేంది, రైల్వే ఉద్యోగి కాశ్వరన్, బీజేపీ నాయకుడు రాజేంద్రన్ తో పాటు అనేక మందిని అరెస్టు చేశారు. ఇదే కేసు విచారణలో బాలిక చెప్పిన నిజాలు, వాస్తవాలు తెలుసుకున్న పోలీసు అధికారులు షాక్ అయ్యారు. బాలిక మొదట గుర్తించిన వ్యక్తి ఓ టీవీ చానల్ రిపోర్టర్ వినోబాజీ వివరాలు తెలుసుకున్న పోలీసుల దిమ్మతిరిగిపోయింది.

 కామాంధులకు చేతికి చిక్కింది

కామాంధులకు చేతికి చిక్కింది

15 ఏళ్ల బాలికను నమ్మించిన షకీరా బాను ఆమెను ఈసీ రోడ్డులోని ఓ రిసార్టుకు తీసుకెళ్లి బంధించారు. తరువాత రిసార్టుకు వచ్చివెళ్లే వాళ్లు బాలిక మీద పదేపదే అత్యాచారం చేస్తూ ఆమె జీవితాన్ని నాశనం చేశారు. నిందితుల మొబైల్ ఫోన్లు పరిశీలించిన పోలీసు అధికారులు షాక్ అయ్యారు. మేము చెప్పినవాళ్లకు పడక సుఖం ఇవ్వాలని షకీరా బాను, సంధ్య, మదన్ మోహన్ దంపతులు, టీవీ రిపోర్టర్ వినోబాజీ, ఓ బీజేపీ నాయకుడు తదితరులు తనను బెదిరించారని బాలిక పోలీసులకు చెప్పింది,

టీవీ చానల్ రిపోర్టర్ అరెస్టు

టీవీ చానల్ రిపోర్టర్ అరెస్టు

తమిళ టీవీ చానల్ కు చెందిన టీవీ రిపోర్టర్ వినోబాజీని చెన్నై పోలీసులు అరెస్టు చేసి బెండ్ తీశారు. పోలీసుల విచారణలో టీవీ చానల్ రిపోర్టర్ వినోబాజీ దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు చెప్పాడు. తనకు తన భార్యకు డబ్బుల విషయంలో వివాదం జరిగిందని వినోబాజీ చెప్పాడు. తన సోదరి సంధ్య, ఆమె భర్త మదన్ కుమార్ అప్పటికే సెక్స్ పరిశ్రమ నిర్వహిస్తున్నారని వినోబాజీ పోలీసులకు చెప్పాడు. తన సోదరి సంధ్య, మదన్ కుమార్ కలిసి తన భార్య కూడా డబ్బులు సంపాధించడానికి సెక్స్ పరిశ్రమను ఎంచుకోవడంతో నేను వారికి సహకరించానని వినోబాజీ పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పాడు.

పార్ట్ టైమ్ రిపోర్టర్, ఫుల్ టైమ్ వడ్డీ, అమ్మాయిల వ్యాపారం

పార్ట్ టైమ్ రిపోర్టర్, ఫుల్ టైమ్ వడ్డీ, అమ్మాయిల వ్యాపారం

వినోబాజీ పార్ట్ టైమ్ గా మాత్రమే వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. అయితే నిత్యం వినోబాజీ వడ్డీ వ్యాపారం, అమ్మాయిల సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నాడని. వాషర్ మెన్ పేట్, ఎన్నూర్ ప్రాంతాల్లో ఇతని వలలో ఇప్పటి వరకు 50 మందికి పైగా అమ్మాయిలు, వివాహిత మహిళలు చిక్కుకున్నారని, వీరందరికి గ్యాంగ్ లీడర్ వినోబాజీనే అని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

కామాంధులకు ఉచ్చ పడుతోంది

కామాంధులకు ఉచ్చ పడుతోంది

15 ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారం కేసులో చాలా మంది పేర్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే వాళ్ల పేర్లు బయటకు రావడం కలకలం రేపింది. పోలీసు శాఖలో డీఎస్పీ హోదాలో పని చేస్తూ రిటైడ్ అయిన ఓ కామాంధుడితో పాటు ఇద్దరు పోలీసు ఇన్స్ పెక్టర్లు, కొందరు డాక్టర్లు, రాజకీయ నాయకులు, వీఐపీలు, కొందరు ప్రముఖులతో సహ లెక్కలేనంత మంది అమ్మాయిపై అత్యాచారం చేశారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది.

సూపర్ సార్, మీరు గ్రేట్

సూపర్ సార్, మీరు గ్రేట్

వాషర్ పేట్ లోని 15 ఏళ్ల అమ్మాయిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులోని నిందితుల పేర్లు ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో చెన్నై సిటీ పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఇంకా ఎంతమంది వీఐపీలు ఉన్నారు ? అనే విషయం పూర్తిగా బయటకు లాగాలని పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ విచారణ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భాదితురాలికి న్యాయం చెయ్యడానికి వీఐపీలను కూడా ఉదలకూడదని సిటీ పోలీసు కమిషనర్ మహేష్ కుమార్ అగర్వాల్ ఆదేశాలు జారీ చెయ్యడంతో ఆయన్ను ప్రజలు మెచ్చుకుంటున్నారు. నిజంగా మీరు గ్రేట్ సార్, హ్యాట్సప్ అంటూ మహేష్ కుమార్ అగర్వాల్ ను మెచ్చుకుంటున్నారు.

English summary
TV Channel reporter arrested in Washermenpet 15 year old Minor girl harassment Case issue in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X