వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతడొక్కడే.. 12 మంది పిడిగుద్దులు..!

|
Google Oneindia TeluguNews

భోపాల్ : చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్దవిగా మారుతున్నాయి. కూర్చుండి మాట్లాడుకుంటే సరిపోయేదానికి కొందరు ఘర్షణకు దిగుతున్నారు. అలా రోడ్డు మీదకొచ్చి కొట్టుకుంటున్నారు. ఇటీవల పోలీసులు ఉన్నారనే భయం లేకుండా రోడ్ల మీద కొట్టుకుంటూ, నరుక్కుంటూ బీభత్సం సృష్టించే ఘటనలు నిత్యం ఏదో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది.

మధ్యప్రదేశ్‌లోని ఇటావా దివాస్ ఏరియాలో ఒక్కడిపై పన్నెండు మంది వ్యక్తులు దాడి చేశారు. పిడిగుద్దులు కురిపించారు. అంతమంది ఒకసారే దాడి చేయడంతో అతడు ఎదురు తిరగలేని పరిస్థితి. విచక్షణారహితంగా కొట్టుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

twelve person attacked on one person in madhya pradesh

తెలంగాణ ప్రభుత్వం కరెంటు బాకీలు.. ఎన్ని కోట్లంటే.. కష్టాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు..!తెలంగాణ ప్రభుత్వం కరెంటు బాకీలు.. ఎన్ని కోట్లంటే.. కష్టాల్లో విద్యుత్ పంపిణీ సంస్థలు..!

రాజేంద్ర అనే వ్యక్తిపై ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది దాడికి తెగబడ్డారు. అలా కొట్టుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకుంటూ అతడికి నరకం చూపించారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా తిరగబడ్డారు. వారిని కూడా లెక్క చేయకుండా నానా మాటలన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయారు. ఎలాగోలా బాధితుడిని రక్షించి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

డబ్బు కారణంగా ఈ గొడవ జరిగినట్లు ఎస్పీ అనిల్ సింగ్ తెలిపారు. బాధితుడిని రక్షించే క్రమంలో దుండగులు పోలీసులను కూడా తిట్టారని చెప్పుకొచ్చారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.

English summary
Man beaten up and dragged on road in Itawa, Dewas, Madhya Pradesh yesterday. Police says, Victim has suffered a fracture on his leg and other injuries. Case has been registered under relevant sections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X