బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Twist: లేడీ టెక్కీ కారు ఎపిసోడ్ కేసులో ట్విస్ట్, అందరికి సినిమా కనపడింది. ఇంకోసారి ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చిన్న విషయంలో ఇరు వర్గాల మద్య వాగ్వాదం జరిగిన తరువాత ఒక లేడీ టెక్కీ సినిమా స్టైల్లో కారు బానెట్‌పై కూర్చున్న వ్యక్తిని సుమారు 2 కిలోమీటర్ల దూరం లాక్కెళ్లింది. సారీ చెప్పమని అడిగిన వ్యక్తి ప్రాణాలతో ఓ లేడీ టెక్కీ చెలగాటం ఆడటం కలకలం రేపింది. దెబ్బకు లేడీ టెక్కీ, ఆమె భర్తతో పాటు మరో వర్గానికి చెందిన ఐదు మంది మీద కేసులు నమోదు అయ్యాయి. కోర్టు ఆదేశాలతో లేడీ టెక్కీతో పాటు ఆమె భర్తకు, వాళ్ల మీద కేసు పెట్టిన యువకులు అందరికి 70 ఎంఎం సినిమా కనపడింది.

Wife: భార్య ఏం చేసిందంటే ?, తిక్కలోడు కాకపోతే ప్రైవేట్ పార్ట్స్ కోసేసి, ఓరీ ముర్ఖుడా, ఎవరికి నష్టం !Wife: భార్య ఏం చేసిందంటే ?, తిక్కలోడు కాకపోతే ప్రైవేట్ పార్ట్స్ కోసేసి, ఓరీ ముర్ఖుడా, ఎవరికి నష్టం !

క్షమాపణ చెప్పమని బలవంతం చేసిన వ్యక్తి చివరికి అతని ప్రాణాల మీదకు తెచ్చుకోవడంతో సామాన్య ప్రజలు హీరోలు అయ్యి అతన్ని రక్షించారు. అయితే ఈ కేసులో లేడీ టెక్కీ దంపతులతో పాటు హోటల్ వ్యాపారి దర్శన్, అతని ఫ్రెండ్స్ చాలా ఓవర్ యాక్షన్ చేశారని బెంగళూరు పోలీసులు మండిపడుతున్నారు.

 Twist in Bengaluru car bonnet episode story, court sent them all to jail,

లేడీ టెక్కీ ప్రియాంక, ఆమె భర్త ప్రమోద్‌ లపై హత్యాయత్నం, బెదిరింపులు, దుర్భాషలాడడం, అసభ్యకరంగా మాట్లాడటం, అసభ్య పదజాలం ఉపయోగించడం, విచ్చలవిడిగా డ్రైవింగ్ చేశారని కేసులు నమోదు చేశారు. టెక్కీల మీద దర్శన్‌ కేసు పెట్టడంతో ఇద్దరి మీద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. లేడీ టెక్కి ప్రియాంక భర్త ప్రమోద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపులు, అసభ్యకరంగా మాట్లాడి మానసికంగా వేధించారని, చంపేస్తామని బెదిరింపులకు దిగారని ఆరోపణలపై దర్శన్ మరియు అతని స్నేహితులపై మీద కేసు నమోదు చేశామని పోలీసులు అన్నారు.

Leader: బాలకృష్ణకు సినిమా చూపించిన పోలీసులు, అధికార పార్టీ అనుకుంటే ?, సీఐ కాలర్ పట్టుకుని !Leader: బాలకృష్ణకు సినిమా చూపించిన పోలీసులు, అధికార పార్టీ అనుకుంటే ?, సీఐ కాలర్ పట్టుకుని !

రెండు కేసులకు సంబంధించి ఐదు మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఐదు మందిని పోలీసులు శనివారం కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న కోర్టు నిందితులు ప్రియాంక, ఆమె భర్త ప్రమోద్, హోటల్ వ్యాపారి దర్శన్, అతని స్నేహితులు యశవంత్, వినయ్, సుజన్ లకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారని బెంగళూరు పోలీసులు తెలిపారు. మొత్తం మీద మొన్న స్కూటర్ ఎపిసోడ్, నిన్న కారు ఎపిసోడ్, రేపు ఏ ఎపిసోడ్ జరుగుతుందో అని బెంగళూరు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary
Twist in Bengaluru car bonnet episode story, court sent them all to jail,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X