వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పలుమార్లు గర్భం,అబార్షన్: జియాఖాన్ మృతిలో ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్‌ నటి, మోడల్‌ జియాఖాన్ కేసులో మరో కొత్త కోణం వెలుగు చూసింది. పలుమార్లు గర్భం ధరించడం, అబార్షన్ కారణంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని తెలుస్తోంది. సిబిఐ బుధవారం నాడు జియాఖాన్ కేసులో ఛార్జీషీట్ దాఖలు చేసింది.

ఈ అభియోగ పత్రంలో కొత్త కోణం వెలుగు చూసిందని తెలుస్తోంది. జియాఖాన్ ఆత్మహత్యకు సూరజ్ పంచోలీ కారణమని అందులో పేర్కొన్నారని తెలుస్తోంది. సూరజ్ తమ విచారణలో కల్పిత కథలు చెబుతున్నట్లుగా సిబిఐ అందులో పేర్కొంది.

జియాఖాన్ పలుమార్లు గర్భం ధరించడం, సూరజ్ బలవంతంతో అబార్షన్ చేయించుకుందని, దీంతో డిప్రెషన్‌కు లోనైందని, చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలిపారని తెలుస్తోంది. ఓసారి, తాను గర్భం దాల్చిన విషయం గురించి సూరజ్‌కు చెప్పిన సమయానికి.. ఆమె నాలుగు వారాల గర్బిణీ.

Twist in Jiah Khan case: Multiple pregnancies and abortions led to suicide

దీంతో, ఇరువురు కలిసి వైద్యుడి వద్దకు వెళ్లి అబార్షన్ చేయించుకోవచ్చునని నిర్ణయించుకున్నారు. అయితే, మెడిసిన్స్ వల్ల ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు గైనకాలజిస్ట్‌ను సంప్రదించారు. సదరు వైద్యుడు వివిధ కలయికల డ్రగ్స్ సూచించాడు.

కాగా, జియాఖాన్‌ ఆత్మహత్య కేసులో సీబీఐ బుధవారం అభియోగ పత్రం దాఖలు చేసింది. బాలీవుడ్‌కు చెందిన ఆదిత్య పంచోలీ, జరీనా వహెబ్‌ దంపతుల కుమారుడు సూరజ్‌ పంచోలీ ఈ కేసులో నిందితుడుగా ఉన్నారు. బాంబే హైకోర్టు నుంచి గత ఏడాది ఈ కేసును దిగువ కోర్టుకు బదిలీ చేశారు.

ఈ కేసులో సీబీఐ విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని పదిహేను రోజుల కిందట కోర్టు కోరింది. దీంతో ఈ ఛార్జీషీట్ దాఖలు చేశారు. సీబీఐ ఈ కేసులో దర్యాప్తు పూర్తిచేసినా అభియోగ పత్రం దాఖలు చేయలేదంటూ ప్రత్యేక మహిళా న్యాయస్థానం న్యాయమూర్తి నవంబరు 18న ప్రస్తావించారు.

English summary
A recent CBI chargesheet states alleged that Sooraj Pancholi was responsible for abetting the suicide of Jiah Khan. It also stated that the actor had fabricated answers while interrogation, which were essential for investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X