వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాల్యా ట్విట్టర్ హ్యాక్: బ్యాంక్ ఖాతా పాస్‌వర్డ్‌లు బయటపెడ్తామంటూ..

|
Google Oneindia TeluguNews

లండన్/న్యూఢిల్లీ: స్వదేశంలో రూ. 9వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న ప్రముఖ లిక్కర్ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అధికారిక ట్విట్టర్‌ ఖాతా హ్యాకయింది. అంతేగాక అతని ఈ మెయిల్స్ కూడా హ్యాక్ చేశారు దుండగులు.

'హల్లో.. మేము మాల్యాకి వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాతాల పాస్‌వర్డ్‌లను తెలుసుకుని మళ్లీ వచ్చేశాం' అంటూ హ్యాకర్లు మాల్యా ఖాతాలో ట్వీట్‌ చేశారు. వివిధ బ్యాంకుల్లో మాల్యాకున్న ఆస్తులు, ఆయన లావాదేవీలకు సంబంధించిన పాస్‌వర్డులు తమకు తెలుసని పేర్కొన్నారు.

Twitter account hacked, says Vijay Mallya

అంతేగాక, 'ఈ అవినీతిపరుడికి సంబంధించిన పలు పత్రాలను కొన్ని వారాల్లో మీముందుకు తీసుకొస్తాం.. చూస్తూ ఉండండి' అని ట్వీట్‌ చేశారు. మాల్యాని తాము బ్లాక్‌మెయిల్‌ చేయలేదని, ఆ విధంగా అతను చేస్తున్న ప్రచారం, ఆరోపణలన్నీ అవాస్తవాలేనని హ్యాకింగ్‌కు పాల్పడిన 'లిజియన్' పేర్కొంది.

మాల్యాకి సంబంధించి వివిధ అంశాలపై జరుగుతున్న విచారణ పూర్తవగానే మాల్యాకి సంబంధించిన బ్యాంక్‌ అకౌంట్లు, విదేశాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ట్వీట్‌ చేసింది.

కాగా, హ్యాకింగ్ విషయంపై విజయ్ మాల్యా సరదాగా స్పందించారు. 'నా ఈ మెయిల్ అకౌంట్ హ్యాక్ చేశారట. లిజియన్ ఈ మేరకు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది. వాట్ ఏ జోక్' అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేగాక, 'నా ఖాతా వివరాలు, ఆర్థిక వ్యవహారాలు కూడా వెల్లడిస్తామంటున్నారు' అంటే ఆయన పేర్కొన్నారు.

English summary
Embattled liquor baron Vijay Mallya today said his twitter and e-mail accounts have been hacked and some of his personal and financial details, including passwords, addresses and phone number, were posted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X