• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Twitter: మోదీ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు -ఉద్యోగుల భద్రతపై ఆందోళన -ఐటీ నిబంధనలపై పేచీ

|

అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థకు, భారత కేంద్ర ప్రభుత్వానికి మధ్య కొద్ది రోజులుగా కొనసాగుతోన్న వివాదం అనూహ్య మలుపు తిరిగింది. కేంద్ర సర్కారుపై విమర్శలకు ట్విటర్ సహకారిగా ఉంటోందనే ఆరోపణలుండగా, సోషల్ మీడియా నియంత్రణ కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన కొత్త ఐటీ చట్టాలపై టెక్ సంస్థలు భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ట్విటర్ మరో అడుగు ముందుకేసి, భారత్ లోని తన ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా మోదీ సర్కారు తీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసింది..

రఘురామ కోసం కదిలిన మోదీ సర్కార్ -కరోనాలోనూ ఢిల్లీ ఎయిమ్స్‌లో స్పెషల్ చేరిక -కష్టంలో తోడున్నందుకురఘురామ కోసం కదిలిన మోదీ సర్కార్ -కరోనాలోనూ ఢిల్లీ ఎయిమ్స్‌లో స్పెషల్ చేరిక -కష్టంలో తోడున్నందుకు

కేంద్రం తీసుకొచ్చిన కొత్త ఐటీ నియమ నిబంధనలను సవాలు చేస్తూ వాట్సాప్ సంస్థ ఇప్పటికే కోర్టులో న్యాయపోరాటానికి దిగగా, గూగుల్ సంస్థ మాత్రం కేంద్రానికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయితే, ట్విటర్ సంస్థ మాత్రం కొత్త ఐటీ నిబంధనలపై మెలిక వ్యాఖ్యలు చేసింది. నిబంధనల అమలుకు ఆరు నెలల గడువు కావాలని కోరింది. అంతటితో ఆగకుండా, కొత్త విధానాలతో భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని, ఇండియాలో పనిచేస్తోన్న తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని సంస్థ పేర్కొంది. ఈ మేరకు ట్విటర్ ప్రతినిధులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.

 Twitter: Concerned about staff safety in India, need time to comply new IT rules

''భారత ప్రజల సేవలకు ట్విటర్‌ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. బహిరంగ చర్చల్లో మా వేదిక కీలక పాత్ర పోషిస్తుందని, మహమ్మారి సమయంలో మా మీడియా ప్రజలకు అండగా ఉందనేది ఇప్పటికే రుజువైంది. అలాంటి మా సేవలను అందుబాటులో ఉంచడం కోసం భారత్‌లోని కొత్త చట్టాలను పాటించేందుకు ప్రయత్నిస్తాం. అయితే పారదర్శకంగా ఉండే సూత్రాలను మాత్రమే కొనసాగిస్తాం. మా సేవల ద్వారా ప్రతి ఒక్కరి గళాన్ని వినిపించేందుకు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడేందుకు కట్టుబడి ఉంటాం'' అని ట్విటర్‌ తన ప్రకటనలో పేర్కొంది. కాగా,

కొత్త ఐటీ చట్టాల ద్వారా భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగే అవకాశముందని ట్విటర్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ''గత కొంతకాలంగా భారత్‌లో మా ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలు, మేం సేవలు అందిస్తున్న వ్యక్తుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు కొత్త నిబంధనలు ముప్పు కలిగిస్తాయనే మా ఆందోళన '' అన్న ట్విటర్.. ఇటీవల ఢిల్లీలోని తమ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేయడాన్ని తప్పుపట్టింది. దాన్నొక బెదిరింపు చర్యగా అభివర్ణించింది.

Covid పుట్టుకపై 90రోజుల్లో దర్యాప్తు-Joe Biden సంచలన ఆదేశాలు -చిక్కుల్లో China, వూహాన్ ల్యాబ్ గుట్టుCovid పుట్టుకపై 90రోజుల్లో దర్యాప్తు-Joe Biden సంచలన ఆదేశాలు -చిక్కుల్లో China, వూహాన్ ల్యాబ్ గుట్టు

భారత ప్రభుత్వంతో నిర్మాణాత్మక చర్చలు కొనసాగిస్తామన్న ట్విటర్.. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని, ప్రజాప్రయోజనాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించింది. బుధవారం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఐటీ నిబంధనలపై ట్విటర్‌ స్పందించడం ఇదే తొలిసారి.

కొవిడ్ విలయ నిర్వహణలో మోదీ వైఫల్యాలను ఎత్తిచూపుతూ కాంగ్రెస్ టూల్ కిట్ రూపొందించిందని బీజేపీ ఆరోపణలలు చేయగా, సదరు ఆరోపణలకు సంబంధించి ఆధారాలు నకిలీవిగా పేర్కొంటూ బీజేపీ నేతల పోస్టులకు ట్విటర్‌ 'మ్యానిపులేటెడ్ మీడియా' అనే ట్యాగ్‌కు జత చేయడం వివాదానికి కారణమైంది. దీనిపై ఆగ్రహించిన కేంద్రం.. ఆ ట్యాగ్‌ను తొలగించాలంటూ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది. మరోవైపు దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఇటీవల ఢిల్లీ పోలీసులు ట్విటర్‌ ఇండియా కార్యాలయానికి వెళ్లి మరీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈలోపే ట్విటర్ సంస్థ ఐటీ చట్టాలపై బహిరంగ ప్రకటన చేయడంతో వివాదం మలుపుతిరిగినట్లయింది.

భారత్‌లో సోషల్ మీడియా, ఓటీటీలు, డిజిటల్ మీడియాకు సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం.. నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ఆయా సంస్థలు దేశీయంగా అంతర్గత యంత్రాంగం ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట గడువులోగా వాటిని పరిష్కరించాలి. అభ్యంతరకరమైన కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు... తదితరాల వివరాలు నెలకోసారి అందజేయాలి. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని, పోస్టింగలను పెడితే... వాటి మూలాలను (మెసేజ్‌లోని వివరాలు ఇవ్వకున్నా) ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉంటుంది.

  Google Working Closely With Jio, ఆ ఫోన్ లాంచ్ చెయ్యడమే లక్ష్యం!! || Oneindia Telugu
  English summary
  Twitter Inc said on Thursday it was worried about the safety of its staff in India, days after Delhi Police personnel visited its offices in south Delhi and Gurugram to "serve notice" in connection with their probe into the controversial 'toolkit' case. "Right now, we are concerned by recent events regarding our employees in India and the potential threat to freedom of expression for the people we serve," a Twitter spokesperson said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X