• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Twitter: పిట్ట కొంచెం.. విరాళం ఘనం: భారత్‌‌కు భారీ డొనేషన్: ఆర్ఎస్ఎస్ ఆధీనంలోని సంస్థకు

|

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విజృంభణ కొద్దిగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. రెండురోజుల వ్యవధిలో 70 వేలకు పైగా పాజిటివ్ కేసల సంఖ్య తగ్గడం ఊరటనిస్తోంది. యాక్టివ్ కేసులు కూడా తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులతో పోల్చుకుంటే.. డిశ్చార్జీలు అధికంగా నమోదయ్యాయి. ఇదే పరిస్థితి మరి కొంతకాలం పాటు కొనసాగితే.. ఇక కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చినట్టే అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరణాలకు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళనకు దారి తీస్తోంది. సోమవారం నాటి బులెటిన్‌తో పోల్చుకుంటే.. తాజాగా మరణాల సంఖ్య అధికంగా నమోదైంది.

  Twitter Donated 15M $ To India | Covid 19 | Jack Dorsey || Oneindia Telugu

  విదేశీ విరాళాల వెల్లువ..

  కరోనా కల్లోల పరిస్థితులు కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో అనేక దేశాలు, బహుళజాతి కంపెనీలు భారత్‌కు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించాయి. ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, సిలిండర్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్స్ (పీపీఈ) కిట్లు.. పెద్ద సంఖ్యలో భారత్‌కు చేరుకుంటున్నాయి. గూగుల్, ఫేస్‌బుక్ వంటి అంతర్జాతీయ కంపెనీలు భారత్‌కు ఆర్థిక సహాయాన్ని, వైద్యరంగం మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి అవసరమైన పరికరాలను విరాళంగా ప్రకటించాయి.

  ట్విట్టర్ భారీ విరాళం..

  ట్విట్టర్ భారీ విరాళం..

  తాజాగా ఈ జాబితాలో మైక్రోబ్లాగింగ్ జెయింట్ ట్విట్టర్ కూడా చేరింది. 15 మిలియన్ డాలర్ల విరాళాన్ని ట్విట్టర్ యాజమాన్యం ప్రకటించింది. భారత కరెన్సీలో దీని విలువ 110 కోట్ల రూపాయలు పైమాటే. సంక్షోభ పరిస్థితుల నుంచి భారత్ కోలుకోవడానికి ఈ మొత్తాన్ని వినియోగించాల్సి ఉంటుందని పేర్కొంది. కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ సంస్థలకు ఈ విరాళాన్ని కేటాయించినట్లు ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జాక్ ప్యాట్రిక్ డోర్సె ప్రకటించారు.

  కేర్-10 మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏకు చెరో రెండున్నర మిలియన్ డాలర్ల చొప్పున విరాళాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు.

  ఆర్ఎస్ఎస్ సంస్థకు

  ఆర్ఎస్ఎస్ సంస్థకు

  కరోనా వైరస్ సృష్టించిన విలయం నుంచి నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందినదిగా భావిస్తున్నారు. ఇదే విషయాన్ని జాక్ డోర్సే కూడా తన ప్రకటనలో ప్రస్తావించారు. సేవా ఇంటర్నేషనల్ యూఎస్‌ఏను హిందూయిజం కోసం పనిచేస్తోన్న లాభాపేక్ష లేని సంస్థగా జాక్ తాను విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

  ప్రాణాలు నిలిపే వైద్యోపకరణాల కోసం..

  ప్రాణాలు నిలిపే వైద్యోపకరణాల కోసం..

  15 మిలియన్ డాలర్ల మొత్తంతో ప్రాణాలను నిలిపే వైద్యోపకరాలు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, వెంటిలేటర్లు, బైలెవె్ పాజిటివిటీ ఎయిర్‌వే ప్రెషర్, కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్‌వే ప్రెషర్‌లను కొనుగోలు చేయాలని సూచించినట్లు తెలిపారు. భారత్‌లో హెల్త్‌కేర్ వ్యవస్థను కరోనా వైరస్ సవాల్ చేస్తోందని, ఈ సంక్షోభ పరిస్థితుల్లో ఆ దేశాన్ని ఆదుకోవడానికి తమవంతు సహకారాన్ని అందించామని పేర్కొన్నారు. తమ సహాయక చర్యలు మున్ముందు కొనసాగుతాయని అన్నారు. ప్రాధాన్యత క్రమంలో వైద్యోపకరణాలు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లను భారత్ అభివృద్ధి చేసుకుంటుందని విశ్వసిస్తున్నామని చెప్పారు.

  English summary
  Micro blogging giant Twitter has donated $15 million (Rs 110.22 crore) to help address the Covid-19 crisis in India which is battling the unprecedented second wave of the deadly pandemic.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X