వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Twitter India పాలసీ డైరెక్టర్ మహిమా కౌల్ రాజీనామా -రైతుల ఉద్యమంపై ట్వీట్ల రచ్చే కారణమా?

|
Google Oneindia TeluguNews

ప్రఖ్యాత సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సంస్థకు సంబంధించి భారత్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల చేస్తోన్న ఉద్యమంపై ట్విటర్ లో చర్చ కొనసాగుతుండటం, దేశానిని హాని చేసేలా విదేశీ శక్తులు కుట్రపన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతోన్న నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశమైంది..

ట్విట్ట‌ర్ సంస్థకు ఇండియాలో పాల‌సీ విభాగం అధినేతగా ఉన్న మ‌హిమా కౌల్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. భార‌త్‌తోపాటు ద‌క్షిణాసియా వ్య‌వ‌హారాల పాల‌సీ విభాగం అధిప‌తిగానూ కొనసాగిన మహిమ తన రాజీనామా విషయాన్ని శనివారం ధృవీకరించారు. కాగా, మార్చి చివర్లోగా ఆమె తన పదవి నుంచి పూర్తిగా బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటారు.

ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -భారత్‌పై విదేశీ కుట్రలకు ఆధారాలు -తేయాకుపైనా పన్నాగంప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు -భారత్‌పై విదేశీ కుట్రలకు ఆధారాలు -తేయాకుపైనా పన్నాగం

Twitter India public policy head Mahima Kaul resigns

ఇటీవ‌ల రైతుల ఆందోళ‌న‌పై కొన్ని హ్యాండిల్స్ కుట్రను ప్రేరేపిస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలంటూ భార‌త ప్ర‌భుత్వం ఫిర్యాదు చేయడం తెలిసిందే. గడిచిన మూడు వారాలుగా ట్విటర్ వేదికగా రైతు ఉద్యమం ఉధృతమవుతుండటం, అదే సమయంలో ఫిర్యాదులు వెల్లువెత్తుతోన్న సందర్భంలోనే మహిమా గిల్ వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

హౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దుహౌజ్ అరెస్టుపై హైకోర్టు సంచలన తీర్పు -నిమ్మగడ్డ ఆదేశాలు రద్దు -మంత్రి పెద్దిరెడ్డి నోరు తెరవొద్దు

కాగా, మహిమ రాజీనామాకు, రైతుల ఉద్యమంపై వివాదానికి సంబంధం లేదని ట్విట్ట‌ర్ వ‌ర్గాల క‌థ‌నం. ఈ ఏడాది ప్రారంభంలోనే మ‌హిమా కౌల్ త‌న ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని ట్విట్ట‌ర్ ప‌బ్లిక్ పాల‌సీ ఉపాధ్య‌క్షుడు మొనిక్యూ మెచె ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఆమె రాజీనామా త‌మ సంస్థ‌కు న‌ష్ట‌మేన‌ని పేర్కొన్నారు. ఐదేండ్ల‌కు పైగా సంస్థ పురోగ‌తిలో ఆమె ముఖ్య‌మైన పాత్ర పోషించార‌న్నారని, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని మెచె పేర్కొన్నారు.

English summary
Twitter India's public policy head Mahima Kaul has resigned citing personal reasons. The development came at a time when the microblogging site remained under the lens of the Ministry of Electronics and Information Technology (Meity) for "violating Indian law" by not taking down tweets related to "farmers genocide".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X