వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విటర్‌లో కొత్త ఫీచర్: ఏమిటది..? 24 గంటల్లోనే ట్వీట్‌ను మాయం చేస్తుందట..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం ట్విటర్ ట్రెండ్‌కు తగ్గట్టుగా యాప్‌లో మార్పులు చేర్పులు చేస్తోంది. యూజర్‌ను దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ వస్తోంది. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను ట్విటర్‌ తీసుకొచ్చింది. ఇంతకీ ఆ కొత్త అప్‌డేట్ ఏంటి..? దాని వల్ల ఏంటి ప్రయోజనం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Recommended Video

Twitter New Feature 'Fleets' in India: All You Need To Know
మార్పులు చేర్పులు

మార్పులు చేర్పులు

ట్విటర్... ఈ సోషల్ మీడియా యాప్‌ ఎంత ప్రసిద్ధిగాంచిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ యాప్ ద్వారా తమ అభిప్రాయాలను, తమ వాదనలను వినిపిస్తుంటారు చాలా మంది ప్రముఖులు. ట్విటర్ పై ఏకంగా యుద్ధాలే జరిగిన రోజులు కూడా ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి అనకాపల్లిలోని సామాన్యుడు వరకు అంతా ఈ ట్విటర్‌కు అలవాటుపడిపోయారు. ఇక స్మార్ట్‌ఫోన్లు వినియోగం ఎక్కువైపోవడంతో ట్విటర్‌కు యూజర్లు కూడా భారీగా పెరుగుతూ వచ్చారు. తమకు ఏదైనా మనసులో తడితే చాలు వెంటనే ఈ ట్విటర్ పిట్ట పై వాలిపోయి తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. ఇక ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు వస్తూనే ఉన్నాయి.

ఫ్లీట్స్ అనే కొత్త ఫీచర్

తాజాగా ట్విటర్‌ సరికొత్త ఫీచర్‌ను రోల్‌ అవుట్ చేసింది. దీనిపేరు ఫ్లీట్స్. ఈ ఫీచర్‌ను ముందుగా భారత్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ట్విటర్‌కు భారత్ పెద్ద మార్కెట్‌. అందుకే ముందుగా ఇక్కడే ప్రారంభించింది. ఇంతకీ ఈ కొత్త ఫీచర్ ఎలా ఉంటుందనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. ఈ కొత్త ఫీచర్‌ ఫ్లీట్స్... ఒక యూజర్ చేసిన ట్వీట్‌ను 24 గంటలు మాత్రమే వాల్‌పై కనిపించేలా చేస్తుంది. ఆ తర్వాత ఆ ట్వీట్‌ను మాయం చేస్తుంది. ఆ ట్వీట్‌కు అప్పటి వరకు వచ్చిన లైకులు, కామెంట్స్ , రీట్వీట్లు అన్నీ మాయమవుతాయి. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో భాగంగా భారత్‌లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఫీచర్‌ పై ఫీడ్ బ్యాక్ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతోంది ట్విటర్.

24 గంటలు మాత్రమే కనిపించే ట్వీట్

ఐఓఎస్ ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్క ఫోన్‌లో ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంటుందని ట్విటర్ పేర్కొంది. రానున్న రోజుల్లో అప్‌డేటెడ్ వెర్షన్‌లపై కూడా ఇది ఉంటుందని పేర్కొంది. ఇంతకీ కొత్త ఫీచర్ ఫ్లీట్స్ అంటే ఏమిటి..? ఫ్లీట్స్ అనేది ట్వీట్స్‌లానే ఉంటుంది. ఇందులో యూజర్ వీడియోలు, జిఫ్‌లు ఫోటోస్‌ను షేర్ చేయొచ్చు. ఇది 24 గంటలు మాత్రమే కనిపించాలని అనుకునేవారు ఫ్లీట్స్‌లో తమ ట్వీట్‌ను పోస్టు చేయొచ్చు.

ఎలా క్రియేట్ చేయాలి..?

ఎలా క్రియేట్ చేయాలి..?

ఇక దీన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేదానిపై సందేహం రావొచ్చు. ముందుగా మీ ప్రొఫైల్ పై ట్యాప్ చేయండి. అక్కడ నుంచి ఏదైనా మెసేజ్ టైప్ చేయడమో లేదా ఫోటోలు వీడియోలు జతచేయడమో చేయండి. అనంతరం పోస్టు చేసే ముందు ఫ్లీట్ పోస్టు పై ట్యాప్ చేయాలి. ఇక పోస్టు చేసిన తర్వాత తన ఫ్లీట్‌ను ఎవరు చూశారనేది పోస్టు కింద కనిపిస్తుంది. అంతేకాదు చివరిసారిగా ఆ వ్యక్తి ట్విటర్‌పై ఏ పోస్టు షేర్ చేశాడో కూడా ఫ్లీట్‌లో కనిపిస్తుంది.

English summary
Microblogging platform Twitter has rolled out a new feature –Fleets –in India that will make tweets disappear after 24 hours and will have no retweets, likes or public comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X