వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్‌దీప్ సర్దేశాయ్ ఉగ్రవాద నిందితుడు: ఒడియా పత్రికలో వార్త

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శనివారం న్యూస్ పేపర్‌లో ప్రధాన వార్త: భారత్‌లో ఎన్నికలతో పాటు దేశంలో ప్రధానంగా రాజకీయ పరిణామాలపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో జాతీయ మీడియా ఛానళ్లలో విశ్లేషణలు అందించే రాజ్‌దీప్ సర్దేశాయ్ ఫొటోను ఒడిషాకు చెందిన ఒక వార్తాపత్రిక ఉగ్రవాద కేసులో నిందితుడిగా పేర్కొంటూ తన మొదటి పేజీలో ప్రచురించింది.

ఉగ్రవాద కేసులో ప్రధాన నిందితుడు ఈయనే అంటూ ఆయన ఫోటోను ఫొటోషాప్‌లో కొద్దిగా మార్పుచేర్పులు చేసి ప్రచురించింది. ముంబైలో అనుమానాస్ప‌ద వ్య‌క్తులు ఆయుధాల‌తో సంచ‌రిస్తున్నార‌న్న నేప‌థ్యంలో నేవీ ముంబై అధికారులు హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ముంబైకి యాభై కిలోమీటర్ల దూరంలో యురాన్‌లోని నేవీ ఆయుధాగారం ద‌గ్గ‌ర ఐదారుగురు వ్య‌క్తుల‌ను తాము చూసిన‌ట్లు అక్క‌డి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చెప్పారు. ఈ క్రమంలో అనుమానిత ఉగ్ర‌వాది స్కెచ్‌ను విడుద‌ల చేశారు. అయితే ఒడిషాకు చెందిన సంబద్ అనే ఒడియా పత్రిక రాజ్‌దీప్ సర్దేశాయ్ ఫొటోను స్కెచ్‌గా మార్చి ప్రచురించింది.

Twitter-ised journalism: When a Odia daily painted Rajdeep Sardesai as a terror suspect

ఈ విషయం తెలుసుకున్న రాజ్‌దీప్ సర్దేశాయ్ తీవ్ర ఆగ్రహావేశానికి గురయ్యాడు. అంతేకాదు సంబద్ పత్రిక తన ఫొటోను స్కెచ్‌గా మార్చి ప్రచురించిందని, ట్విట్టర్‌లో ఎవరో ఏదో చెబితే దాన్ని పట్టుకుని ఇలా వేశారేంటని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు ఇదేనా జర్నలిజం? ఫోటోషాప్ చేసిన ఫొటోలనూ చూస్తే సిగ్గుగా ఉందంటూ మండిపడ్డారు.

దీంతో సంబద్ పత్రిక ఎడిటర్ ట్విట్టర్ ద్వారా రాజ్‌దీప్ సర్దేశాయ్‌కి క్షమాపణలు తెలిపారు. అయినా ఆయన శాంతించలేదు. క్షమాపణలను అంగీకరిస్తాను గానీ, తప్పు చేసిన విషయాన్ని పత్రిక మొదటిపేజీలో తన ఫొటోతో మళ్లీ ప్రచురించాలని ట్విట్ ద్వారా డిమాండా చేశారు.

ఆయన చెప్పినట్లే మొదటిపేజీలో ఆయన ఫొటోతో సహా క్షమాపణ వార్తను బాక్సు కట్టి మరీ ప్రచురించారు. దానిని కూడా రాజ్‌దీప్ మళ్లీ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే, గతంలో రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్విట్టర్ అకౌంట్‌ను కొంతమంది హ్యాక్ చేసి అసభ్యకర సందేశాలు పంపిన సంగతి తెలిసిందే. దాంతో కొన్నాళ్ల పాటు ఆయన తన ట్విట్టర్ ఖాతాను వాడటం మానేశారు.

English summary
A local Odia newspaper, Sambad, on Friday splashed on its front page a sketch of Sardesai as a terror suspect. The sketch was part of the newspaper's story on the terror suspect school children were reported to have spotted in Mumbai on Thursday, which had sent Mumbai security forces into a tizzy for two days, but with no success in catching the suspect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X