వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: ఆదివారం రాత్రి దీపాలపై సోషల్ మీడియాలో మీమ్స్, ఒక్కొక్కరు ఒకలా ఫొటో, వీడియోలు పోస్ట్...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్‌ను అందరం కలిసి ఐకమత్యంతో ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్ ఆర్పివేసి సంఘీభావం తెలుపాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరిన నేపథ్యంలో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొలా సోషల్ మీడియాలో రియాక్టవుతున్నారు. ఆదివారం హ్యాపీ డెంట్ యాడ్ రాబోతోందని కొందరు.. మరికొందరు విభిన్నంగా కామెంట్ చేస్తున్నారు. ట్వీట్టర్ కూడా మీమ్స్, విజువల్ కామెంట్లు షేర్ చేస్తోంది.

నిశీధి రాత్రిలో వీధి స్తంభం పైన మనిషి ఉండి, నోటిలో లైట్ వెలుగు ఆన్ చేసినట్టు కనిపించింది. ఈ ఫొటోకు నెటిజన్లు ఎక్కువగా లైక్ పెట్టారు. మరికొందరు రాత్రి 9 గంటలకు భారతదేశ చిత్ర పటం ఎలా ఉంటుందో మ్యాప్ తీసి పోస్ట్ చేశారు. వెలుతురు శక్తి ఏంటో ప్రజలకు తెలుసు.. తన దీపం ఆరిపోవడంతో దేవదాసు చనిపోయాడు.. ఆ శక్తి మొత్తం దీపంలోనే ఉంది అని మరొకరు ట్వీట్ చేశారు.

Twitter Lights Up with Memes After PM Modi Asks India to End Darkness

మరొకరు ఓం బత్తి, దీపం విక్రయాలు పెరుగుతాయనే మీమ్ షేర్ చేశారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రతీ ఒక్కరు ఓం బత్తి పట్టుకుంటే ఇలా ఉంటారని మరికొందరు పోస్ట్ చేశారు. ఏప్రిల్ నెలలో దేశం దీపావళిని జరిపించుకోబోతోంది అని మరికొందరు వీడియో పోస్ట్ చేశారు. రాత్రి 9 గంటలకు ఇండియా ఇలా ఉండబోతుందని నాసా ఫోటో తీసి పంపించింది. రాత్రి 9 గంటల నుంచి 9.09 గంటల వరకు క్యాండిల్ ముందు ఉంటానని చెబుతోన్న చిన్నారి నోరు తెరిచిన వీడియో కనిపిస్తోంది. ఆ 9 నిమిషాల దీపాల వెలుగులో తన పళ్లు హ్యపీ డెంట్ మాదిరిగా మెరిసిపోతాయని ట్వీట్ చేశారు. బాలీవుడ్ అగ్రనటులు టార్చ్ లైట్ పెట్టుకున్న ఫోటో కూడా ట్రోల్ అవుతోంది.

English summary
Twitter was soon flooded over with memes and visual commentary on how they would take part in the sunday occasion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X