వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

twitter recap 2020:ఈ ఏడాది ట్విట్టర్ ను ఊపేసిన అంశాలివే..టాప్ ట్రెండ్ లో ఉన్న జాబితా ఇదే

|
Google Oneindia TeluguNews

2020 వ సంవత్సరం ముగింపుకు వచ్చేశాం. ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అత్యంత చెత్త సంవత్సరం అని, ఈ సంవత్సరం పాజిటివ్ అనే పదం అత్యంత నెగటివ్ పదమని అందరూ చర్చిస్తున్నారు. అయితే ఈ ఏడాది సోషల్ మీడియాను ఊపేసిన వివిధ అంశాలపైన కూడా డిస్కస్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది ఇప్పటికే యాహూ టాప్ మోస్ట్ సెర్చ్ సెలబ్రిటీస్, న్యూస్ మేకర్స్ 2020 ను రిలీజ్ చేసింది . ఇక ఈ క్రమంలో ఈ ఏడాది ట్విట్టర్ వేదికగా ప్రజలు చర్చించిన అంశాలను సోమవారం ఆ సంస్థ వెల్లడించింది.

Recommended Video

Twitter Recap 2020: Top Hashtag for 2020 #COVID19 | #SushantSinghRajput| #Hathras
ట్విట్టర్ లో ఎక్కువగా ట్రెండ్ .. ఫస్ట్ ప్లేస్ లో కరోనా మహమ్మారి

ట్విట్టర్ లో ఎక్కువగా ట్రెండ్ .. ఫస్ట్ ప్లేస్ లో కరోనా మహమ్మారి

ఈ ఏడాది అత్యధికంగా ట్విట్టర్లో కోవిడ్ మహమ్మారి పైనే నెటిజన్లు సెర్చ్ కొనసాగిందని, ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడించారని తెలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ట్విట్టర్లో ప్రజలు అత్యధికంగా చర్చించిన అంశం కరోనా మహమ్మారి అని పేర్కొన్నారు. ట్విట్టర్ సంస్థ చెప్పిన వివరాల ప్రకారం ట్విట్టర్లో 2020లో అత్యధికంగా ప్రజలు కోవిడ్ మహమ్మారి గురించి చర్చిస్తే, కరోనా టైంలో ఫ్రంట్లైన్ వారియర్స్ గా పనిచేసిన వారికి కృతజ్ఞతలు చెప్పడానికి ట్విట్టర్ వినియోగం ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం పెరిగింది. ప్రత్యేకంగా వైద్యులకు కృతజ్ఞతలు తెలుపుతూ 135 శాతం పెరగగా, ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలపడం 30శాతం పెరిగినట్లుగా తెలుస్తుంది.

రెండో స్థానంలో సుశాంత్ సింగ్ రాజపూత్ మరణం

రెండో స్థానంలో సుశాంత్ సింగ్ రాజపూత్ మరణం

కరెంట్ అఫైర్స్ లో కోవిడ్ 19 మహమ్మారి #covid 19 అత్యధిక హాష్ టాగ్ లతో ట్వీట్ల లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక ఆ తర్వాతి స్థానంలో ఆత్మహత్యకు పాల్పడిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిలిచారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నివాళిగా #sushanthsinghrajput పేరుతో నెటిజన్లు పెట్టిన ట్వీట్లు, అతని మరణం తర్వాత ట్విట్టర్ వేదికగా సుశాంత్ సింగ్ రాజ్ పూత్ కోసం ఫాన్స్ ఉద్వేగం రెండవ స్థానంలో నిలిచింది.

మూడో స్థానంలో హత్రాస్ దళిత యువతిపై సామూహిక హత్యాచారం .. సినిమాలలో దిల్ బేచారా

మూడో స్థానంలో హత్రాస్ దళిత యువతిపై సామూహిక హత్యాచారం .. సినిమాలలో దిల్ బేచారా

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ లోని దళిత యువతిపై సామూహిక హత్యాచారం ఘటన ట్విట్టర్లో విస్తృత చర్చకు తెరతీసింది. ఇది ట్విట్టర్లో #hathras బాగా ట్రెండ్ అయిన ఘటనగా మూడో స్థానాన్ని సంపాదించుకుంది. సినిమాల విషయానికి వస్తే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన హిందీ సినిమా #dilbechara దిల్ బేచారాపై అభిమానులు ఎక్కువగా చర్చించారు. ఆ తర్వాత హీరో సూర్య నటించిన సూరారిపొట్రును #suraripotru తమిళ సినీ అభిమానులు అత్యధికంగా చర్చించారు.

క్రీడల్లో ఐపీఎల్ 2020 ..

క్రీడల్లో ఐపీఎల్ 2020 ..

ఆ తరువాత అత్యధిక చర్చ జరిగిన తెలుగు సినిమా సరిలేరు నీకెవ్వరు. ఆహేష్ బాబు , రష్మికా మందన్నా నటించిన ఈ చిత్రంపై కూడా #sarileruneekevvaru అన్న హ్యాష్ ట్యాగ్ తో చర్చ జరిగింది . ఈ మూడు సినిమాలపై ఈసారి ట్విట్టర్లో పెద్ద సంఖ్యలో ట్వీట్లు కనిపించాయి.ఇక క్రీడల విషయానికి వస్తే అత్యధికంగా #ipl2020 ఐపీఎల్ 2020 గురించి ట్విట్టర్లో చర్చ జరిగింది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ టీం హ్యాష్ ట్యాగ్ #విజిల్ పొడు పై , మహిళా టి20 ప్రపంచ కప్ లో భారత జట్టు అద్భుత ప్రదర్శనకు ట్విటర్లో #teamindia టీమిండియా హ్యాష్ ట్యాగ్ తో అభిమానుల అభినందనలు కొనసాగాయి.

English summary
The Twitter on Monday revealed the topics that people have been discussing on this year’s Twitter platform. The most talked about topic on Twitter this year around the world is the Covid 19 pandemic. top hashtag for 2020 was #COVID19, and the other two top hashtags were #SushantSinghRajput and #Hathras.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X