• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ... శశి థరూర్ ప్రయోగించిన కొత్త ఇంగ్లీష్ పదం...

|

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌‌కు ఇంగ్లీష్ భాషపై ఉన్న పట్టు గురించి అందరికీ తెలిసిందే. ఆయన మాట్లాడితే కొన్ని పదాలకు డిక్షనరీలో అర్థాలు వెతుక్కోవాల్సిందే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై సెటైరికల్‌గా ఆయన ప్రయోగించిన ఓ పదం ట్విట్టర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇంతకీ శశి థరూర్ ప్రయోగించిన ఆ పదమేంటంటే... 'పొగొనోట్రోఫీ'.దీని అర్థం గడ్డం పెంచడం. ట్విట్టర్‌లో డా.ప్రియా ఆనంద్ అనే ఓ నెటిజన్ తనకేదైనా కొత్త ఇంగ్లీష్ పదం నేర్పించాలని శశి థరూర్‌ను కోరగా... ఆయన ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఈ పదాన్ని ప్రస్తావించారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు... అటు ప్రియా ఆనంద్‌కు కొత్త పదం నేర్పించడంతో పాటు ఇటు ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రం సంధించారు శశి థరూర్.

twitterati scurrying dictonaries for shashi tharoor new english word

'నా స్నేహితుడు రతిన్ రాయ్,ఆర్థికవేత్త,ఇవాళ నాకో కొత్త పదం నేర్పించాడు. అది పొగొనోట్రోఫీ. అంటే... గడ్డం పెంచడం అని అర్థం. ఎలాగంటే... కరోనా మహమ్మారి వేళ ప్రధాని నరేంద్ర మోదీ పొనొగోట్రోఫీని(గడ్డం పెంచుకోవడం) ఒక వ్యాపకంగా మార్చుకున్నట్లు...' అని శశి థరూర్ వ్యంగ్యాస్త్రం సంధించారు.

థరూర్ ప్రయోగించిన ఈ పదంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.'ప్రపంచానికి ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ ఉన్నట్లు భారత్‌కు థరూర్ డిక్షనరీ ఎందుకు ఉండకూడదు...' అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. మరో నెటిజన్... 'ఈ కొత్త పదాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థరూరిక్షనరీకి ధన్యవాదాలు...' అని కామెంట్ చేశారు.

శశి థరూర్ మాటల్లో,ప్రసంగాల్లో,ట్వీట్లలో ఇలాంటి పదాలు చాలానే దొర్లుతుంటాయి. రెండు నెలల క్రితం తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇదే విషయంలో శశి థరూర్‌పై సరదా వ్యాఖ్యలు చేశారు. కరోనా చికిత్సలో ఉపయోగించే పోసాకోనాజోల్, క్రెసెంబా, టోసిలిజుమాబ్, రెమ్ డెసివివర్, బారిసిటినిబ్, ఫ్లావిపిరావిర్, మోల్నుపిరావిర్, లిప్సోమాల్ ఆంఫోటెరెసిన్ వంటి ఔషధాల పేర్లను కేటీఆర్ ఉదహరిస్తూ... బహుశా నోరు తిరగని ఈ పేర్లను పెట్టడం వెనుక శశి థరూర్ పాత్ర ఉండొచ్చునని ఫన్నీ కామెంట్ చేశారు.

కేటీఆర్ ట్వీట్‌పై అంతే సరదాగా స్పందించిన థరూర్... 'ఔషధాలకు అలాంటి పేర్లు పెట్టడంలో తప్పేమీలేదు... అయినా ఇలాంటి విషయాలు మీకెందుకు? నేను చూసుకుంటాగా నాకు వదిలేయండి. నేను కరోనా మందులను హ్యాపీగా 'కరోనిల్, కరోజీరో, గో కరోనా గో' అంటూ పిలుచుకుంటాను' అని ట్వీట్ చేశారు. ఇదే క్రమంలో థరూర్ తనదైన శైలిలో floccinaucinihilipilification నోరు తిరగని పదాన్ని ప్రయోగించారు. దీంతో మంత్రి కేటీఆర్... దేవుడా ఇప్పుడు మరో డిక్షనరీని బయటకు తీయాల్సి వచ్చేట్టు ఉందని ఫన్నీ కామెంట్ చేశారు. థరూర్ ఇలా ఎప్పటికప్పుడు ట్విట్టర్‌లో కొత్త పద ప్రయోగాలతో నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతూనే ఉన్నారు.

English summary
A Twitter user reached out to Shashi Tharoor, saying she was waiting to learn a new word and the former Union minister was quick to oblige."My friend Rathin Roy, the economist, taught me a new word today: pogonotrophy, which means 'the cultivation of a beard'. As in, the PM's pogonotrophy has been a pandemic preoccupation ," he said in a tweet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X