వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంత దారుణమా..! : 'ఆవు మూత్రం తాగించి.. పేడ తినిపించి..'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : అక్రమంగా బీఫ్ ను తరలిస్తున్నారన్న కారణంగా ఇద్దరు యువకులతో ఆవు మూత్రం తాగించి, పేడ తినిపించారు గో సంరక్షణ సమితి సభ్యులు. గో సంరక్షణ సమితి సభ్యులు చేసిన ఈ నిర్వాకం సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో విషయం కాస్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

న్యూఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ లో గో సంరక్షణ సమితి అధ్యక్షుడు ధర్మేంద్ర యాదవ్, అతని అనుచరులు కలిసి రిజ్వాన్ ముక్తియర్ అనే ఇద్దరు ముస్లిం యువకుల పట్ల పైశాచికంగా వ్యవహరించారు. యువకులిద్దరు ఏడు వందల కేజీల గొడ్డు మాంసాన్ని అక్రమంగా తరలిస్తుంటే పట్టుకున్నామని ఆరోపిస్తోన్న గోరక్షణ సమితి సభ్యులు.. అందుకు గుణపాఠంగా ఆవు మూత్రం, పేడ, పాలు, పెరుగు, నెయ్యిల మిశ్రమమైన పంచగవ్యను వాళ్లతో తినిపించామని తెలిపారు.

ragging

పంచగవ్యను తినిపించడం ద్వారా వాళ్లను పరిశుద్దులని చేసినట్టు సదరు గోరక్షణ సమితి సభ్యులు ప్రకటించడం గమనార్హం. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించగా.. 300 కేజీల బీఫ్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీస్ అధికారి ఫరిదా వెల్లడించారు. అయితే యువకులకు ఆవు మూత్రం తాగించడం, పేడ తినిపించడం లాంటి విషయాలేవి తమ దృష్టికి రాలేదని పోలీసులు పేర్కొనడం మరిన్ని చర్చలకు తావిస్తోంది.

English summary
In the wake of gunshot injuries to three gau rakshaks over the past two days in Haryana, allegedly in altercations with people illegally transporting beef, a video has surfaced showing volunteers of the Gau Rakshak Dal forcing two men, who they suspected were beef transporters, to eat a concoction of cow dung, cow urine, milk, curd and ghee almost a fortnight ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X