వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్టీ టిక్కెట్ల లోల్లి, బీఎస్పీ నాయకులకు చెప్పుల హారం, గాడిద మీద ఊరేగింపు, వైరల్ !

|
Google Oneindia TeluguNews

జైపూర్: టిక్కెట్ల పంపిణి విషయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ)కి చెందిన ఇద్దరు జాతీయ స్థాయి నాయకులకు చెప్పులు, షూల హారం వేశారు. అంతటితో శాంతించని కార్యకర్తలు ఓ నాయకుడిని పార్టీ కార్యాలయం ముందు నుంచి గాడిద మీదఊరేగించి కసి తీర్చున్న సంఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగింది. బీఎస్పీ నాయకులకు చెప్పుల హారం వేసి గాడిద మీద ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

బీఎస్పీ టిక్కెట్ల పంపిణి విషయంలో డబ్బులు తీసుకుని టిక్కెట్లు అమ్ముకున్నారని కార్యకర్తలు అనుమానించారు. ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నాయకులకు పార్టీలో పెద్దపీట వేస్తున్నారని బీఎస్పీ కార్యకర్తలు అసహనంతో ఊగిపోయారు.

Two BSP leaders were garlanded with shoes and one paraded on Donkey in Rajasthan

మంగళవారం బీఎస్పీ జాతీయ సమన్వయకర్త (జాతీయ కోఆర్డినేటర్) రామ్ జీ గౌతమ్, బీఎస్పీ రాజస్ఘాన్ రాష్ట్ర మాజీ ఇన్ చార్జ్ నాయకుడు సీతారామ్ తదితరులు జైపూర్ లోని బనిపార్క్ సమీపంలోని పార్టీ కార్యాలయం దగ్గరకు చేరుకున్నారు.

ఆ సమయంలో అక్కడికి పెద్దఎత్తున చేరుకున్న బీఎస్పీ కార్యకర్తలు రామ్ జీ గౌతమ్, సీతారామ్ లకు చెప్పులు, షూల హారాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. తరువాత రామ్ జీ గౌతమ్ అక్కడి నుంచి తప్పించుకోవడంతో సీతారామ్ ను కార్యకర్తలు పట్టుకున్నారు.

బీఎస్పీ కార్యాలయం ముందు సీతారామ్ కు చెప్పుల హారం వేసి అక్కడి నుంచి గాడిద మీద ఊరేగించారు. డబ్బుల కోసం బీజేపీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి పార్టీ టిక్కెట్లు విక్రయిస్తున్నారని, గత ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన మామ్మల్ని పట్టించుకోవడం లేదని బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు ఆరోపించారు.

తాము ఎన్ని సార్లు ధర్నాలు చేసిన పార్టీ నాయకురాలు మాయావతికి సమాచారం ఇవ్వకపోవడం వలనే ఇలా చేశామని కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న మాయావతి కాంగ్రెస్ పార్టీ వలనే ఇంత జరిగిందని అసహనం వ్యక్తం చేశారు. ఇది చాలా సిగ్గు చోటు, ఇలా జరగకుండా ఉండాల్సిందని, తమ పార్టీకి చెడ్డపేరు తీసుకురావాలని కొందరు ఇలా చేశారని మాయావతి ఆరోపించారు.

English summary
Two BSP leaders were garlanded with shoes and one paraded on Donkey outside the party office In Rajasthan on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X