వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవెగౌడపై పోటీకి సిద్ధమైన ఇద్దరు కాంగ్రెస్ రెబెల్స్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : తుమ్కూరు లోక్‌సభ సీటు కర్నాటక కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. పొత్తులో భాగంగా ఆ నియోజకవర్గాన్ని మిత్రపక్షం జేడీఎస్‌కు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు గుర్రుమంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ కొందరు నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు. పార్టీ నిర్ణయాన్ని కాదని పోటీకి సిద్ధమవుతున్నారు.

తుంకూరులో ఇద్దరు కాంగ్రెస్ రెబెల్స్ నామినేషన్

తుంకూరులో ఇద్దరు కాంగ్రెస్ రెబెల్స్ నామినేషన్

కర్నాటక అసెంబ్లీలాగే లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. మిత్రపక్షాల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా తుమ్కూరు నియోజకవర్గాన్ని కాంగ్రెస్ అధిష్టానం జేడీఎస్ కు ఇచ్చింది. ఆ స్థానం నుంచి మాజీ ప్రధాని దేవెగౌడ పోటీకి సిద్ధమయ్యారు అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన సిట్టింగ్ ఎంపీ ముద్దహనుమగౌడతో పాటు ఎమ్మెల్యే కేఎన్ రాజన్న తుంకూరు నియోజకవర్గం నుంచి స్వతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.

టికెట్ల కేటాయింపులో వారసులకే ప్రాధాన్యంటికెట్ల కేటాయింపులో వారసులకే ప్రాధాన్యం

సిట్టింగ్ స్థానమని ఒకరు, జేడీఎస్‌కు ఇవ్వద్దని మరొకరు

సిట్టింగ్ స్థానమని ఒకరు, జేడీఎస్‌కు ఇవ్వద్దని మరొకరు

సిట్టింగ్ ఎంపీ ముద్ద హనుమగౌడ ఈసారి కూడా తుమ్కూరు టికెట్ తనకే ఇస్తారని ఆశించారు. ఆ తర్వాత పరిణామాలతో అప్రమత్తమై జేడీఎస్‌కు ఆ టికెట్ కేటాయించవద్దని అభ్యర్థించారు. అయితే హైకమాండ్ ఆయన అభ్యర్థనను పట్టించుకోకపోవడంతో రెబల్‌గా బరిలో దిగారు. ఇక తుమ్కూరు స్థానాన్ని జేడీఎస్‌కు ఇవ్వడం ఏ మాత్రం జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కేఎన్ రాజన్న కూడా ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేశారు. దేవెగౌడను బెంగళూరు నార్త్ నుంచి పోటీ చేయాలని మొదటి నుంచి కోరుతున్నా.. ఆయన తమ మాట పెడచెవిన పెట్టినందునకే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. ఒకవేళ దేవెగౌడ జేడీఎస్‌ను వదిలి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, తమ ఓట్లు ఆయనకే వేస్తామని అంటున్నారు.

హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న పరమేశ్వర

హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న పరమేశ్వర

తాజా పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, డిప్యూటీ సీఎం పరమేశ్వర స్పందించారు. పార్టీ అధిష్టానం తుమ్కూరు సీటును జేడీఎస్ కు కేటాయిస్తుందని తాము ఊహించలేదని ఆయన అన్నారు. అయితే హై కమాండ్ నిర్ణయాన్ని గౌరవించి దేవెగౌడకు మద్దతు ఇచ్చి ఆయన గెలుపునకు కృషి చేస్తామని చెప్పారు.

చివరి నిమిషం వరకు దేవెగౌడ ఊగిసలాట

చివరి నిమిషం వరకు దేవెగౌడ ఊగిసలాట

నిజానికి దేవెగౌడ తుమ్కూరు, బెంగళూరు నార్త నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పోటీచేయాలన్న దానిపై ఎటూ తేల్చుకోలేకపోయారు. చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సన్నిహితుడైన జీఎస్ బసవరాజ్ తుమ్కూర్ నుంచి పోటీకి దింపడంతో దేవెగౌడ కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. మరి దేవెగౌడ నిర్ణయంతో తలెత్తిన పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

English summary
Defying the pre-poll understanding between the ruling alliance partners in Karnataka, two Congress leaders Monday filed their nominations for the Tumkur Lok Sabha constituency — the seat from where former prime minister and JD(S) president H D Deve Gowda announced he would contest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X