హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అజ్ఞాతంలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు, బీజేపీకేనా?: కాంగ్రెస్ ఆందోళన

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప బలనిరూపణ పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేల ఆచూకీ దొరకకపోవడం ఆ పార్టీలో కొంత ఆందోళనకు గురిచేస్తోంది.

కర్ణాటక బలనిరూపణ: ఇలా చేస్తే బీజేపీదే అధికారం, కీలక మార్గాలివేకర్ణాటక బలనిరూపణ: ఇలా చేస్తే బీజేపీదే అధికారం, కీలక మార్గాలివే

రాయచూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ పాటిల్, విజయనగర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనంద్ సింగ్‌లు శనివారం ఉదయం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. వీరిద్దరూ కూడా బీజేపీకి మద్దతు తెలిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Two congress MLAs are still missing

అయితే, కాంగ్రెస్ మాత్రం ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జేడీఎస్‌లకే మద్దతుగా ఉంటారని చెబుతున్నారు. ఆనంద్ సింగ్ ఫోన్‌లో తమకు టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది.

సా.5గంటల నుంచే సంబరాలు, అందాక ఓపికగా ఉండండి: ధీమాగా యడ్యూరప్పసా.5గంటల నుంచే సంబరాలు, అందాక ఓపికగా ఉండండి: ధీమాగా యడ్యూరప్ప

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో శనివారం సాయంత్రం 4గంటలకు కర్ణాటక అసెంబ్లీలో యడ్యూరప్ప ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమైంది. తాము బలపరీక్షలో నెగ్గి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని బీజేపీ చెబుతుండగా, బీజేపీకి మెజార్టీ లేదని, ఓటమి ఖాయమని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

English summary
Both congress mlas Pratap gouda Patil of raichur and Anand Singh of Vijayanagara constituency still missing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X