వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో పాపం: అక్కడ బహిర్భూమికి వెళ్లారని దళిత చిన్నారులను కొట్టి చంపారు

|
Google Oneindia TeluguNews

శివపురి: మధ్యప్రదేశ్‌లో కులవివక్ష కోరలు చాచింది. పంచాయతీ భవనం ఎదురుగా ఉన్న రోడ్డుపై బహిర్భూమికి వెళ్లారని ఇద్దరు దళిత చిన్నారులను ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ ఘటన శివపురి జిల్లాలో చోటుచేసుకుంది. శివపురి జిల్లాలో భావకేడి గ్రామంకు ఈ ఇద్దరు చిన్నారులు చెందినవారిగా తెలుస్తోంది.

 కోరలు చాచిన కుల వివక్ష

కోరలు చాచిన కుల వివక్ష

తమ గ్రామం భావకేడిలో ఇంకా కులం పేరుతో దూషణలు జరుగుతున్నాయని మృతి చెందిన చిన్నారుల్లో ఒక చిన్నారి తండ్రి చెప్పారు. చిన్నారులను చితకబాదిన హకీమ్ యాదవ్, అతని సోదరుడు రామేశ్వర్ యాదవ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో ఆ ఇద్దరే చిన్నారులను కొట్టి చంపినట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు.

పంచాయతీ భవనం ముందు బహిర్బూమికి వెళ్లారని..

పంచాయతీ భవనం ముందు బహిర్బూమికి వెళ్లారని..

ఉదయం 6:30 గంటలకు 12 ఏళ్ల రోషణి బాల్మికీ, 10ఏళ్ల అవినాష్ బాల్మికీ అనే చిన్నారులు ఇద్దరూ గ్రామంలోని పంచాయతీ భవనం ఎదురుగా ఉన్న రోడ్డుపై బహిర్భూమికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో హకీం యాదవ్ అతని సోదరుడు రామేశ్వర్ యాదవ్‌లు చిన్నారులను చితకబాదినట్లు మృతుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తీవ్రగాయాలు పాలైన ఇద్దరు చిన్నారులను ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

 కులం పేరుతో తరుచూ వేధింపులు

కులం పేరుతో తరుచూ వేధింపులు

గ్రామంలో బోరింగ్ నుంచి తాము నీరు తీసుకోవాలంటే ముందుగా అగ్రవర్ణాల వారు తీసుకున్నాకే తమకు అవకాశం ఉండేదని మృతి చెందిన బాలుడు అవినాష్ బాల్మికీ తండ్రి మనోజ్ బాల్మికీ తెలిపారు. రెండేళ్ల క్రితం ఇదే విషయమై నిందితులతో తాను వాగ్వాదానికి దిగినట్లు మనోజ్ తెలిపాడు. ఆ సమయంలో తనను కులం పేరుతో దూషించి చంపేస్తామని బెదిరించారని మనోజ్ వెల్లడించాడు. తమ కోసం తక్కువ డబ్బుకే పనిచేయాలని కోరినట్లు చెప్పారు.

ప్రభుత్వంపై మాయావతి ఫైర్


దళిత చిన్నారులను హత్య చేయడంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు గ్రామాల్లో టాయ్‌లెట్స్ ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని మండిపడ్డారు బెహెన్‌జీ. చిన్నారులను అగ్రకులాల వారు కొట్టి చంపడం అత్యంత హేయమైన చర్యగా చెబుతూ ఆమె ట్వీట్ చేశారు. దళితులను కొట్టి చంపే వారిని ఉరితీయాలంటూ ఆమె మరో ట్వీట్ చేశారు.

English summary
Two Dalit children were allegedly beaten to death by two persons for defecating on a street in front of a panchayat building in Madhya Pradesh's Shivpuri district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X