వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళలకు ఎంట్రీ ఉందా లేదా : భక్తుల కోసం నేడు తెరుచుకోనున్న శబరిమల ఆలయ ద్వారాలు

|
Google Oneindia TeluguNews

కేరళ: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనంకు కేసును బదిలీ చేసిన తర్వాత శనివారం రోజు తొలిసారిగా భక్తుల కోసం ఆలయ ద్వారాలు తెరుచుకోనున్నాయి. శనివారం రోజున మండల పూజ జరగనుంది. అయితే కొత్తగా ఎలాంటి తీర్పు రానందున అన్ని వయస్సుల మహిళలు ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది. ఇది గతేడాది వచ్చిన తీర్పునకు అనుగుణంగానే జరగనుంది. అయితే మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించడం లేదు.

శబరిమల రివ్యూ పిటిషన్: నాడు కేసులో ఒక్కో జడ్జీ ఎలాంటి తీర్పు ఇచ్చారు..?శబరిమల రివ్యూ పిటిషన్: నాడు కేసులో ఒక్కో జడ్జీ ఎలాంటి తీర్పు ఇచ్చారు..?

శబరిమల ఆలయంలోకి వెళతానన్న తృప్తి దేశాయ్

శబరిమల ఆలయంలోకి వెళతానన్న తృప్తి దేశాయ్

శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించకపోవడంపై తొలి నుంచి గొంతెత్తుతున్న మహిళా హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్ నవంబర్ 20వ తేదీన శబరిమల ఆలయంకు వచ్చి దర్శనం చేసుకుంటానని చెప్పారు. తనకు భద్రతతో సంబంధం లేదని వెల్లడించారు. అయితే భక్తులు ఇప్పటికే శబరిమలకు చేరుకుంటుండగా మహిళలకు ప్రవేశం కల్పిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.

 కేసు పూర్వాపరాలు

కేసు పూర్వాపరాలు

కొన్ని దశాబ్దాలుగా శబరిమల ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయస్సున్న మహిళల ప్రవేశంపై ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు ఆంక్షలు విధించింది. ఇలా 1951 నుంచి మహిళలను ఆలయంలోకి ప్రవేశం కల్పించడం లేదు. ఇక మహిళలకు ఆలయంలోకి ప్రవేశం కల్పించకపోవడం అనే అంశానికి 1965లో చట్టబద్ధత తీసుకొచ్చారు. దీనిపై పిటిషన్ దాఖలు కాగా 1991లో కేరళ హైకోర్టు సమర్థించింది.

 మహిళలకు ప్రవేశం ఉందంటూ గతేడాది తీర్పు

మహిళలకు ప్రవేశం ఉందంటూ గతేడాది తీర్పు

ఇక ఆ తర్వాత గతేడాది సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు మహిళలకు ప్రవేశం కల్పిస్తూ తీర్పు చెప్పింది. ఈ తీర్పును అప్పటి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా ఇచ్చారు. అయితే తీర్పుపై హిందూ సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. పంబా, నీలక్కల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున్న నిరసన కార్యక్రమాలు అక్టోబర్ 17, 2018న జరిగాయి. ఆ రోజు తొలిసారిగా ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. నిరసనకారులు మహిళలను, జర్నలిస్టులను అడ్డుకోవడమే కాదు వారిపై దాడులకు దిగారు.

Recommended Video

Sabarimala Verdict : Supreme Court Refers Case To Larger Bench || Oneindia Telugu
విస్తృత స్థాయి ధర్మాసనం ఏర్పాటు

విస్తృత స్థాయి ధర్మాసనం ఏర్పాటు


ఇక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై తిరిగి రివ్యూ పిటిషన్ దాఖలైంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏడుగురు సభ్యుల ధర్మాసనంకు కేసును బదిలీ చేసింది. శబరిమలతో పాటు ఇతర మతాల్లో కూడా మహిళలకు ఆంక్షలు ఉన్నాయని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అందువల్ల వీటన్నిటిపై సమీక్ష జరగాల్సి ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.మతం విశ్వాసాలపై చర్చ జరగాలని పిటిషనర్లు ఆశిస్తున్నారని కోర్టు వెల్లడించింది. దీంతో ఎవరికి వారు విజయం తమదేనంటూ చెప్పుకున్నారు.

English summary
Two days after the Supreme Court deferred the verdict on the Sabarimala issue, the Lord Ayappa Temple is all set to open today for the Mandala Pooja festival. Women of all age groups will be allowed to enter the temple, however, no protection will be given to the women
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X