రిలయన్స్ లో అగ్నిప్రమాదం: ఇద్దరు సజీవదహనం
అహమ్మదాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది ఇద్దరు కార్మికులు సజీవదహనం అయిన ఘటన గుజరాత్ లోని జామ్ నగర్ లో జరిగింది. ఇక్కడి ఆర్ఐఎల్ జామ్ నగర్ లోని రిలయన్స్ ప్లాంట్ డొమెస్టిక్ టారీఫ్ ఏరియా (డీటీఏ) రిఫైనరీలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనం అయ్యారు. ఎనిమిది మంది కాంట్రాక్టు కార్మికులకు మంటలు వ్యాపించడంతో వెంటనే వారిని జామ్ నగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న రిలయన్స్ అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చెయ్యడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. మెయింటెనెన్స్ కోసం ఉత్పత్తి నిలిపివేసిన సమయంలో అగ్నిప్రమాదం జరిగిందని రిలయన్స్ ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే మంటలు అదుపులోకి వచ్చాయని, అక్కడ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీ వర్గాలు చెప్పాయి. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని, వారు త్వరగానే కోలుకుంటారని రిలయన్స్ ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications