వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శభాష్ డాక్టర్స్.. తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే డ్యూటీలోకి.. ఒకరు కారు ఇద్దరు.. ఎక్కడ అంటే

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. దీంతో వైద్యుల సేవలు తప్పనిసరి. వారికి బోనస్ ఇస్తూ మరీ పని చేయించుకుంటున్నారు. అయితే గుజరాత్‌లో మాత్రం ఇద్దరు వైద్యులు శభాష్ అనిపించుకున్నారు. వైద్యో నారాయణో హరి అని ఎందుకు అన్నారో నిరూపించారు. తమ కన్న తల్లులు చనిపోతే.. అంత్యక్రియలు పూర్తి చేసిన వెంటనే విధుల్లో హాజరయ్యారు. మిగతావారికి ఆదర్శంగా నిలిచారు.

తల్లులు చనిపోయినా..

తల్లులు చనిపోయినా..

తల్లులను కోల్పోయినా, భావోద్వేగాలను సైతం అదుపు చేసుకున్నారు వారిద్దరూ. అంత్యక్రియలు పూర్తయిన వెంటనే మళ్లీ విధులకు హాజరయ్యారు. ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వడోదర ప్రాంతానికి చెందిన డాక్టర్ శిల్పా పాటిల్ తల్లి కాంతా అంబాలాల్ పాటిల్ వారం రోజుల పాటు కరోనాతో పోరాడి మృత్యువాత పడ్డారు. తల్లి మరణంతో డాక్టర్ శిల్పా పాటిల్ కుంగిపోకుండా, తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించారు. తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే నేరుగా ఆసుపత్రికి వచ్చి విధుల్లో కొనసాగారు.

ఒకరు కరోనా.. మరొకరు సాధారణమే

ఒకరు కరోనా.. మరొకరు సాధారణమే

గాంధీనగర్ కు చెందిన డాక్టర్ రాహుల్ పర్మార్ కూడా ఇదేవిధంగా తన నిబద్ధతను చాటుకున్నారు. అతని తల్లి వృద్ధాప్య సంబంధ సమస్యలతో కన్నుమూశారు. దాంతో డాక్టర్ రాహుల్ పర్మార్ కొన్ని గంటల పాటు తన విధులకు దూరమై తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆపై మరేమీ ఆలస్యం చేయకుండా తిరిగి తన విధులకు హాజరయ్యారు. డాక్టర్ పర్మార్ గుజరాత్ లోనే అతిపెద్ద ఆసుపత్రిలో కొవిడ్ మేనేజ్ మెంట్ విభాగం నోడల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. దేశమంతా కరోనాతో అతలాకుతలం అవుతుంటే తాము విధులు నిర్వర్తించడం ఎంతో అవసరమని ఆ ఇద్దరు వైద్యులు వినమ్రంగా తెలిపారు.

లాక్ డౌన్ మాదిరి నిబంధనలు

లాక్ డౌన్ మాదిరి నిబంధనలు

ఇటు బీహర్‌లో లాక్ డౌన్ మాదిరి నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చారు. క్వారంటైన్ కేంద్రాలను కూడా అన్నీ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేస్తారు. ముఖ్య పట్టణాల్లో కూడా కంపల్సరీగా నెలకొల్పుతారు. కరోనా సోకిన వారిని నేరుగా అక్కడికే పంపిస్తారు. మాంసం, మెడికల షాపులు, నిత్యావసర వస్తువులు సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. రెస్టారెంట్లలో డెలివరీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. అక్కడ భోజనం చేసే వెసులుబాటు లేదు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కూడా క్లోజ్ చేస్తారు. పెళ్లిళ్లు, కర్మలు కూడా నిషేధం అమల్లో ఉంటుంది. కానీ 100 మంది వరకు పరిమిత సంఖ్యలో చేసుకునే అవకాశం ఉంది. జనసమ్మర్థం గల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఫైర్ సర్వీస్, ఈ కామర్స్ వాహనాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది.

English summary
two doctors in gujarat attends duty immediately after their mothers last rites
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X