• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జమ్మూలో మరోమారు డ్రోన్ల కలకలం.. మిలిటరీ స్టేషన్ దగ్గర మరో రెండు డ్రోన్లు, ఉగ్ర కుట్ర తిప్పికొట్టిన ఆర్మీ !!

|

జమ్మూలోని వైమానిక స్థావరంపై డ్రోన్ల సహాయంతో ఉగ్రదాడికి ప్రయత్నం చేసిన 24 గంటల్లోనే మరోమారు జమ్మూలో డ్రోన్ల కలకలం రేగింది. జమ్మూలోని ఒక మిలిటరీ స్టేషన్ సమీపంలో గత రాత్రి రెండు డ్రోన్లు కనిపించడంతో భద్రతా దళాలు కాల్పులు జరిపిన తరువాత పెద్ద ముప్పు తప్పిందని ఆర్మీ చెబుతోంది.సైన్యం డ్రోన్ లపై కాల్పులు జరిపిన తరువాత డ్రోన్లు అక్కడ నుండి వెళ్లిపోయినట్లు అని ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.

  #IndiaChinaFaceOff : Watch IAF Apache, IAF’s Fighter Aircraft Jets Patrolling At LAC || Oneindia

  ఢిల్లీలో హై అలెర్ట్ : డ్రోన్స్ తో నిఘా, దుర్భేద్యమైన కోటని తలపిస్తూ ఢిల్లీలో భద్రతఢిల్లీలో హై అలెర్ట్ : డ్రోన్స్ తో నిఘా, దుర్భేద్యమైన కోటని తలపిస్తూ ఢిల్లీలో భద్రత

   డ్రోన్ల ద్వారా దాడులకు ఉగ్ర కుట్ర .. కాల్పులు జరిపిన భద్రతా దళాలు

  డ్రోన్ల ద్వారా దాడులకు ఉగ్ర కుట్ర .. కాల్పులు జరిపిన భద్రతా దళాలు

  జమ్మూలోని కలుచక్ మిలిటరీ స్టేషన్ సమీపంలో 2 డ్రోన్లు కనిపించాయని, మొదటిది రాత్రి 11.30 గంటలకు, రెండవది తెల్లవారుజామున 1.30 గంటలకు కనిపించిందని భద్రతా దళాలు వెల్లడించాయి. 2021 జూన్ 27-28 అర్ధరాత్రి, రత్నుచక్-కలుచక్ మిలిటరీ ప్రాంతంపై రెండు వేర్వేరు డ్రోన్ కార్యకలాపాలను గుర్తించిన దళాలు వెంటనే అలర్ట్ అయ్యాయి. భద్రతా దళాలు త్వరితగతిన ప్రతిచర్యకు దిగాయి. డ్రోన్లను నిర్వీర్యం చేసే క్రమంలో భద్రతా దళాలు 22 రౌండ్ లు కాల్పులు జరిపాయని ఆర్మీ ప్రకటించింది. భద్రతా దళాల అప్రమత్తత వల్ల పెద్ద ముప్పు తప్పిందని,ఇక డ్రోన్ల కోసం జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్ పురోగతిలో ఉందని ఆర్మీ తెలిపింది.

  వైమానిక దళం వద్ద డ్రోన్ లతో దాడులు .. అలెర్ట్ అయిన ఆర్మీ

  వైమానిక దళం వద్ద డ్రోన్ లతో దాడులు .. అలెర్ట్ అయిన ఆర్మీ

  తాజా సంఘటనపై కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించింది. నగర శివార్లలోని బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంపై డ్రోన్ తిరుగుతున్నట్లు గమనించి సైన్యం కాల్పులు జరిపింది. మిలిటరీ స్టేషన్‌ను వెంటనే చుట్టుముట్టి డ్రోన్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది ఆర్మీ .వైమానిక దళం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన పేలుళ్లలో డ్రోన్‌లను ఉపయోగించిన 24 గంటల తర్వాత కొత్త డ్రోన్‌లను గుర్తించారు.మొదటి పేలుడు విమానాశ్రయం యొక్క సాంకేతిక ప్రాంతంలో భవనం పైకప్పుకు నష్టం కలిగించగా రెండవది భూమి మీద పేలింది.

  ఉగ్ర దాడులకు డ్రోన్ లు ఇదే తొలిసారి

  ఉగ్ర దాడులకు డ్రోన్ లు ఇదే తొలిసారి

  పేలుడు పదార్థాన్ని జారవిడిచేందుకు పేలోడ్ ఉన్న డ్రోన్ ఉపయోగించినట్లు అనుమానిస్తున్నట్లు జమ్మూ కాశ్మీర్ డైరెక్టర్ జనరల్ పోలీస్ దిల్బాగ్ సింగ్ తెలిపారు. భారతీయ సైనిక కేంద్రంపై ఉగ్రవాద దాడిలో ఉపయోగించిన డ్రోన్‌లను ఉపయోగించటం ఇదే తొలిసారి. గతంలో భారత్ లో ఉన్న ఉగ్రవాదులకు సందేశాలు అందించటానికి , వారికి కావాల్సిన ఆయుధాలు అందించటానికి ఉపయోగించిన డ్రోన్ లను ఇప్పుడు ఏకంగా దాడుల కోసమే ఉపయోగిస్తున్నారు.

  దాడుల వెనుక పాక్ ఆధారిత ఉగ్రవాదుల హస్తం .. తిప్పికొట్టిన ఆర్మీ

  దాడుల వెనుక పాక్ ఆధారిత ఉగ్రవాదుల హస్తం .. తిప్పికొట్టిన ఆర్మీ

  అంతర్జాతీయ సరిహద్దు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైమానిక దళం వద్ద ఈ దాడి వెనుక పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదులు ఉన్నారని దర్యాప్తు సంస్థలు మరియు పోలీసులు చెబుతున్నారు.
  తరువాత ఆదివారం, ఐదు నుంచి ఆరు కిలోల బరువున్న పేలుడు పరికరంతో ఒక ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ అరెస్టుకు ఎయిర్ బేస్ వద్ద దాడితో సంబంధం లేదని అన్నారు.
  మొత్తానికి డ్రోన్ల ద్వారా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేయాలనుకున్న పెద్ద టెర్రర్ దాడిని ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టిందని తెలిపారు.

  English summary
  The army says a major threat was averted after two drones were seen last night near a military station in Jammu and fired at by alert troops, hours after drones were used in a terror attack on the Jammu Air Force base.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X