వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్‌లో గంజాయి విక్రయం ... 6 కోట్లు కూడబెట్టిన కేటుగాడు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : అతడో విద్యావంతుడు .. చేసింది జర్నలిజం .... కానీ చిన్న వయస్సులోనే చెడు తిరుగుళ్లు, స్నేహలతో అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాడు. ఈజీ మనీ సంపాదించడం ఎలా అని ఆలోచించాడు. మంచో చెడో చూడలేదు .. తనకు డబ్బులు కావాలని మాత్రమే అనుకొని రంగంలోకి దిగాడు. ఇప్పటికే రూ 6 కోట్ల వరకు సంపాదించాడు. కానీ చేసేదీ నేరం కాబట్టి .. రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయాడు.

జర్నలిజం టు .. గంజాయి విక్రయం ....
ఇదిగో ఈ పక్క ఫోటోలో కనిపిస్తోన్న వ్యక్తి పేరు కానవ్ అహుజ. విదేశాల్లో జర్నలిజం చేసింది ఇతగాడే. కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడాడు. ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయిస్తున్నాడు. భావి భారత పౌరుల మత్తులో జోగేందుకు కారణమయ్యాడు. గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారంతో కానవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అనేక కీలక వివరాలు బయటపడ్డాయి. కానవ్‌తోపాటు అతడి పార్ట్‌నర్ జస్‌ప్రీత్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1.7 కిలోల గంజాయి .. 2.26 లక్షల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Two drug peddlers booked in Noida for selling ganja online

విదేశాల్లో చదువు .. తిరిగి మళ్లీ ...
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం చేసేందుకు సిడ్నీ వెళ్లొచ్చాడు కావవ్. ఢిల్లీ తిరిగొచ్చాక అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఏం చేయాలా అని ఆలోచించాడు. అయితే అప్పటికే షిల్లాంగ్‌కు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె ద్వారా గంజాయి సరఫరదారులు పరిచయమయ్యారు. వీరికి ఒక వాట్సాప్ గ్రూపు కూడా ఉంది. తన స్నేహితుడు జస్‌ప్రీత్ సింగ్‌తో కలిసి ఇంజినీరింగ్ కాలేజీ అడ్డాలుగా చేసుకొని గంజాయి విక్రయిస్తున్నాడు. ఇందుకోసం నోయిడా సెక్టార్ 74 కేప్ టౌన్ సూపర్ టెక్ వద్ద ఓ ఇల్లును కూడా అద్దెకు తీసుకొని ఉంటున్నారు. వీరికి అసోం నుంచి గంజాయి వచ్చేందని ... వాటిని గజియాబాద్ రైల్వేస్టేషన్ వద్ద తీసుకొనేవారని పోలీసులు తెలిపారు. గంజాయి విక్రయిస్తూ కనావ్ .. ఇప్పటివరకు రూ.6 కోట్లు సంపాదించినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.

English summary
Police on Thursday arrested a young drug peddler, Kanav Ahuja, along with his associate from Sector 78 in Noida, for allegedly selling ganja online to the college students of Noida, Delhi and Greater Noida area.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X