వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పతాగి ట్రాఫిక్ సిగ్నల్ జంప్, యూనిఫామ్ చించేసి, దాడి చేసిన యువతులు

తప్పతాగిన ఇద్దరు యువతులు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపారు. రెండు సార్లు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చంఢీఘడ్: తప్పతాగిన ఇద్దరు యువతులు ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపారు. రెండు సార్లు ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసి ట్రాఫిక్ పోలీసులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

పంజాబ్ రాష్ట్రంలోని ఎస్ఎఎస్ నగర్ కు చెందిన ఇద్దరు యువతులు సోమవారం రాత్రి సెక్టార్ 43 రోడ్డుపై వేగంగా కారులో వెళ్తున్నారు. డ్రైవింగ్ చేస్తున్న 29 ఏళ్ళ యువతి ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేసింది.

స్వయంగా పోలీస్ సిగ్నల్ ఇచ్చినా పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. దీంతో పోలీసులు పదినిమిషాల పాటు ఆమె కారును వెంబడించారు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో వారు పోలీసులకు చిక్కారు.

Two drunk women jump signal, tear uniform of cop who gave them chase in Chandigarh

అయితే కారులో ఉన్న యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపాలని పోలీసులు భావించారు.అయితే ఆ యువతులు ట్రాఫిక్ పోలీసులకే చుక్కలు చూపారు.

కారులో నుండి బీరు బాటిల్ ను తీసుకొచ్చి నెత్తిన ఓ యువతి నెత్తిన పగులగొట్టుకొంది. అంతటితో ఆగకుండా పోలీసులపై చేయిచేసుకొని యూనిఫామ్ ను చించేసింది. పక్కనున్న వాళ్ళు వారిస్తున్నా వినకుండా ఇద్దరూ పోలీసులపైకి దూసుకెళ్ళారు.

అప్పటికే సాయంత్రం 6.45 నిమిసాలు కావడంతో వారిని అరెస్టు చేయకుండా డ్యూటీ మేజిస్ట్రేట్ ఆదేశించారు. దీంతో తెల్లారేసరికి వేచిచూసిన పోలీసులు మరుసటి రోజు ఉదయం సెక్టార్ 43 మెయిన్ గేట్ వద్ద అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు. వారిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.

English summary
Two women in their 20s, both SAS Nagar residents, were arrested for allegedly assaulting a traffic cop and tearing his uniform on Tuesday. The incident happened on Monday late evening after a 29-year-old woman allegedly jumped a traffic light in Sector 43 and did not stop on a cop’s signal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X