వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బిడ్డ నాది .. కాదు నాది ... పసికందు కోసం స్నేహితుల ఫైట్, డీఎన్ఏ టెస్ట్‌కు బ్లడ్ శాంపిల్స్ ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కాలం మారింది. ఆధునిక పోకడలతో విలువలు లేకుండా పోతున్నాయి. ఇక బంధాలు, అనుబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సంగతిని జనం ఎప్పుడో మరచిపోయారు. ఇక కర్ణాటకలో విచిత్ర ఘటన జరిగింది.

స్నేహితుడు అని రానిస్తే ..

స్నేహితుడు అని రానిస్తే ..

బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీ. ఈ సిటీలో ప్రతి ఒక్కరు ఎవరి లైఫ్‌లో వారు బిజీ. సిటీ శివారులో సుంకదకట్టలో కుమార్ దంపతులు ఉంటున్నారు. కుమార్, అతని స్నేహితుడు జాన్ ఓకే కంపెనీలో సూపర్‌వైజర్లుగా పనిచేస్తున్నారు. ఇంతవరకు ఓకే .. కానీ ఇటీవల జాన్ .. కుమార్ 11 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. తన స్నేహితుడు ఎందుకిలా చేశాడో అర్థంకానీ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు.

బిడ్డ కోసం గొడవ

బిడ్డ కోసం గొడవ

పోలీసుల విచారణలో విస్తుగొలిపే నిజాలు వెలుగుచూశాయి. ఆ చిన్నారి తన బిడ్డ అని జాన్ అనడంతో నోరెళ్లబెట్టడం అక్కడున్న వారి వంతైంది. అదేంటి కుమార్ దంపతులు బిడ్డ .. నీ బిడ్డ ఎలా అవుతుంది అని ప్రశ్నిస్తే .. కుమార్ భార్యతో తనకు వివాహేతర సంబంధం ఉందని తెలిపాడు. గత రెండేళ్ల నుంచి అఫైర్ ఉందని వివరించాడు. వాస్తవానికి కుమార్ ఇంటికొచ్చిన సమయంలోనూ .. అతని భార్య చనువుగా ఉండేది. దీనిని బట్టి జాన్, కుమార్ భార్యకు చిన్నారి జన్మించాడా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.

 స్నేహ చెడటంతో .. కిడ్నాప్

స్నేహ చెడటంతో .. కిడ్నాప్

అయితే గతకొద్దిరోజుల నుంచి జాన్, కుమార్ మధ్య స్నేహం చెడింది. ఇంటికి రాకపోకలు కూడా నిలిచిపోయాయి. దీంతో విసిగిపోయిన జాన్ .. ఈ నెల 24న కుమార్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో కుమార్ లేకపోవడంతో అతని భార్యకు ఓ డ్రింక్ ఇచ్చాడు. బరువు తగ్గే డ్రింక్ అని చెప్పడంతో ఆమె తాగింది. సృహ కోల్పోవడంతో తన పనిని తేలికగా చేసుకున్నాడు జాన్. చిన్నారిని తీసుకొని పారిపోయాడు. సాయంత్రం వచ్చి బాలుడు ఏడి అని అడిగితే .. మధ్యాహ్నం ఇంటికి జాన్ వచ్చాడని .. కూల్ డ్రింక్ తాగడంతో సృహ కోల్పోయానని చెప్పింది. దీంతో కుమార్ వెంటనే కామాక్షాపాళ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు జాన్‌ సహా చిన్నారిని తీసుకొచ్చారు.

డీఎన్ఏ పరీక్ష ..?

డీఎన్ఏ పరీక్ష ..?

ఇక ఇక్కడే పోలీసులకు సమస్య వచ్చింది. బాలుడిని కుమార్ దంపతులకు ఇచ్చేందుకు జాన్ ససేమిరా అంగీకరించలేదు. ఆ బిడ్డ తన బిడ్డేనని భీష్మించుకొని కూర్చొన్నాడు. కుమార్ కూడా కాదు తన బిడ్డేనని చెప్పడంతో ఏం చేయాలో పోలీసులకు తెలియలేదు. ఇరువురికి సర్దిచెప్పినా వినలేదు. దీంతో సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు చిన్నారి రక్త నమూనాలను డీఎన్ఏ పరీక్ష చేయాలని నిర్ణయించారు. డీఎన్ఏ రిపోర్ట్ ఎవరితో సరిపోలితే వారికే పిల్లాడిన ఇస్తామని చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. కానీ స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జాన్ చేసిందే తప్పు .. పైగా బిడ్డ కోసం రచ్చకెక్కడం ఏంటని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో కుమార్‌ది తప్పు ఉందని .. భార్యను చెప్పుచేతల్లో ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పరిణామాలు సమాజానికి అంత శ్రేయస్కరం కాదని మేధావులు అంటున్నారు.

English summary
The couple have a live in suburban Bangalore. Kumar and his friend John supervisors in the company. But recently John .. lifted the kumar boy. Kumar approached the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X