వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియుడి కోసం రోడ్డుపైనే కొట్టుకున్న యువతులు

|
Google Oneindia TeluguNews

మీరట్: ఓ యువతి కోసం ఇద్దరు యువకులు కొట్టుకోవడం సినిమాల్లో చూసేవుంటాం. అయితే ఇక్కడ ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు నిజంగానే నడిరోడ్డుపైనే కొట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మాధవపురంలో చోటు చేసుకుంది.

మాధవపురం ప్రాంతానికి చెందిన పూజ అనే యువతి స్థానిక మొబైల్ దుకాణంలో పని చేస్తోంది. పూజ తన స్నేహితుడిని తనకు కాకుండా చేస్తోందని ఆర్థి అనే మరో యువతి ఆరోపించింది.

Two girls fight over boyfriend on street

కాగా, గురువారం పూజ మొబైల్ దుకాణానికి వెళ్తుండగా ఆర్తి ఆమెను అడ్డుకుంది. తన ప్రియుడికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. అయితే ఆర్తి మాటలను పూజ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆర్తి.. పూజను రోడ్డుపైనే కొట్టడం ప్రారంభించింది.

దీంతో పూజ కూడా ఎదురుదాడి చేసింది. ఇద్దరు తీవ్రంగానే కొట్టుకున్నారు. ఈ ఘటనను స్థానికులు చూస్తూ, వీడియోలు తీస్తూ నవ్వుకున్నారు. మరికొందరు వారిని వారించేందుకు ప్రయత్నించారు. కాగా, ఈ వీడియో ఆన్‌లైన్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.

English summary
Two girls in Madhavpuram area entered into an argument and violent fight over their boyfriend on Thursday. Some of the locals present there captured the cat fight in their camera.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X