బెంగాల్ లో ఢీ కొన్న రెండు రైళ్లు - పట్టాలు తప్పిన 12 బోగీలు, 14 రైళ్లు రద్దు..!!
ఒడిశా రైలు ప్రమాదం మర్చిపోక ముందే మరో రైలు ప్రమాదం జరిగింది. ఒడిశాలో జరిగిన విధంగానే రెండు రైళ్లు ఢీ కొన్నాయి. అయితే, ఈ సారి గూడ్స్ రైళ్లు కావటంతో ప్రాణ నష్టం లేదు. పశ్చిమ బెంగాల్ లో ఈ ప్రమాదం జరిగింది. ఒండా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారు జామున రెండు గూడ్స్ రైళ్లు ఢీ కొన్నాయి. దీంతో 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. దీంతో ఖరక్‌పూర్ .. బంకూరా ..ఆద్రా లైన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేసారు.
పశ్చిమ బెంగాల్ లో బంకురాలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓండా స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు లోకో పైలట్ కు గాయాలు అయ్యాయి.

ఒక గూడ్స్ రైలు మెయిన్ లైన్ బదులు లూప్ లైన్ లోకి ప్రవేశించి అక్కడ ట్రాక్ పైన ఉన్న మరో గూడ్స్ ను ఢీ కొట్టింది. దీంతో 12 కోచ్ లు పట్టాలు తప్పాయి. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రెండు గూడ్స్ రైళ్లు ఖాళీగా ఉన్నాయి. ఈ ప్రమాదం కారణంగా ఆద్రా డివిజన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి.
#WATCH | West Bengal: Two goods trains collided at Onda railway station in Bankura. Rail operation on Kharagpur–Bankura–Adra line has been halted. More details awaited. pic.twitter.com/T4sL5rn7Rp
— ANI (@ANI) June 25, 2023
ఈ ప్రమాదానికి కారణమేంటి అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే, సిగ్నల్ వ్యవస్థలో లోపం కారణంగానే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఆద్రా డివిజన్‌లో పలు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ట్రాక్ లను క్లియర్ చేయడానికి, రైళ్ల సేవలను పునరుద్దరించడానికి రైల్వే అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ సెక్షన్ లో ప్రయాణించే 14 రైళ్లను ఈశాన్య రైల్వే తాత్కాలికంగా రద్దు చేసింది. మూడు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మూడు రైళ్లను దారి మళ్లించారు. ఈ ప్రమాదం పైన రైల్వే శాఖ ఆరా తీస్తోంది. రెండు సరుకు రవాణా రైళ్లు ఒకే లైన్‌పై ఎలా వచ్చాయని ప్రశ్న తలెత్తుతోంది.












Click it and Unblock the Notifications