వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోటోస్ వైరల్: బెంగాల్‌లో రెండు తలల పాము ప్రత్యక్షం.. గ్రామస్తులు ఏంమంటున్నారంటే..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

#WatchVideo : Two Headed Snake Found In West Bengal || Oneindia Telugu

రోడ్డుపై అలా నడుచుకుంటూ పోతుంటే ఒక పాము ఎదురైతే ఎలా ఉంటుంది. ఆమడ దూరం పరుగులు తీస్తాం. అదే రెండు తలలు ఉన్న పాము ఎదురైతే..? ఏంటి నమ్మడం లేదా.. అవును రెండు తలలున్న పాముల గురించి ఎప్పుడో చిన్నప్పుడు బామ్మలు చెప్పే కథలల్లో వినిఉంటాం. లేదా సినిమాల్లో గ్రాఫిక్స్‌లో చూసి ఉంటాం. కానీ నిజంగానే రెండు తలల పాము ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్ సెన్షేషన్ అయ్యింది.

రెండు తలల పాము ఫోటోస్ వైరల్

రెండు తలల పాము ఫోటోస్ వైరల్

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పాము కథ లేకుండా ఉండటం లేదు. ఎందుకంటే పాము గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నెటిజెన్లను కట్టిపడేస్తాయి. అంతేకాదు వీటికి సంబంధించిన పోస్టులు కూడా సోషల్ మీడియాలో కొన్ని గంటలల్లోనే వైరల్ అవుతాయి. గత నెలలో ముగ్గురు చిన్నారులు చనిపోయిన పాముతో తాడాట ఆడుతూ కనిపించిన వీడియో వైరల్ అయ్యింది. అక్టోబర్‌లో న్యూజెర్సీలోని కొందరు ఉద్యోగులు రెండు తలలు ఉన్న పామును చూసి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కానీ ఈ రోజు పాము కథ మన భారతదేశం నుంచే పుట్టుకొచ్చింది.

 అడవుల నుంచి వచ్చిన పాము

అడవుల నుంచి వచ్చిన పాము

వెస్ట్ బెంగాల్‌లోని మిద్నాపూర్ జిల్లాలో ఉన్న ఏకరుకి గ్రామంలో రెండు తలల పాము ప్రత్యక్షమైంది. బెల్డా అటవీ ప్రాంతం నుంచి ఈ పాము వచ్చినట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. అయితే పాముకు హాని చేయకూడదు లేదా బంధించరాదన్న మూఢనమ్మకాలతో గ్రామస్తులు దాన్ని వదిలేశారు. గ్రామస్తుల మూఢనమ్మకాల వల్లే ఈ అరుదైన రెండు తలల పామును పట్టుకోలేకపోయామని హెర్పటాలజిస్ట్ కస్తవ్ చక్రవర్తి చెప్పారు.

శాస్త్రీయ కారణాలతోనే రెండు తలలు

శాస్త్రీయ కారణాలతోనే రెండు తలలు

అయితే రెండు తలల పాము గురించి కస్తవ్ చక్రవర్తి వివరించారు. మనుషుల్లో ఎలా అయితే రెండు తలలు, రెండు బొటనవ్రేలులు వస్తాయో పాములు కూడా రెండు తలలతో పుడతాయని చెప్పారు. ఇది పూర్తిగా బయలాజికల్ ఇష్యూ అని చెప్పారు. అంతే తప్ప పురాణాల సంబంధింత విశ్వాసాలకు నమ్మకాలకు ఇక్కడ తావులేదని వివరించారు. ఇలాంటి అరుదైన రెండు తలల పాములు ఎక్కువ కాలం బతకాలంటే వాటిని బంధించి సంరక్షించడం ఒక్కటే మార్గమని చెప్పారు. రెండు తలల పామును సంరక్షిస్తే పాము జీవితకాలం పెరుగుతుందని చెప్పారు.

రెండు తలల పాము అత్యంత విషపూరితం

ఇక ఈ ఫోటోలు వైరల్ కావడంతో దీన్ని చూసిన జువాలజిస్టు ఇది నజా కౌటియా జాతికి చెందిన పాము అని చెప్పారు. దీన్నే బెంగాలీలో బెంగాల్ ఖరీస్, హిందీలో కాలానాగ్ అని కూడా పిలుస్తారని చెప్పారు. ఈ రెండు తలల పాములు అత్యంత విషపూరితమైనవని జువాలజిస్టు చెప్పారు. పిండం విభజించబడటంతోనే రెండు తలలతో పాము పుడుతుందని ఆయన వెల్లడించారు.

English summary
A two headed snake was spotted in Ekarukhi village of Belda forest range in West Bengal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X