టెక్కీలకు షాక్ :సాప్ట్ వేర్ కు కష్టకాలమే,ఉద్యోగులకు ఐటి కంపెనీ బాస్ ల లేఖలు
ముంబై : ప్రపంచ వ్యాప్తంగా మారిన పరిస్థితులు, దేశంలో పెద్ద నగదునోట్ల రద్దు వంటి పరిణామాలు ఐటి రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. మారిన పరిస్థితులు ఐటి రంగానికి తీవ్ర ముప్పు పొంచి ఉందనే సంకేతాలను రెండు ధిగ్గజ ఐటి కంపెనీలకు చెందిన ప్రముఖులు తమ కంపెనీ ఉద్యోగులను హెచ్చరించారు.
ప్రపంచంలోని అతి పెద్ద ఐటి కంపెనీల్లో ఇన్పోసిస్, విప్రో కంపెనీలు పేరు పొందాయి. అయితే ఈ కంపెనీల ఉద్యోగులకు ఈ ఇద్దరు సిఇఓలు రాసిన లేఖలు దేశంలోని ఐటి రంగంపై ప్రతికూల ప్రభవాలను చూపుతున్నవిషయాన్ని వెల్లడిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కావడంతో పాటు దేశంలో పెద్ద నగదు నోట్లను రద్దుచేయడం వంటి పరిణామాలు కూడ ఐటి రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయని ఐటి కంపెనీల బాస్ లు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ , ఆర్థిక సంఘర్షణల నేపథ్యంలో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటుందని ప్రముఖ ఐటి కంపెనీల బాస్ లు అభిప్రాయంతో ఉన్నారు. ఇదే ఇలానే కొనసాగితే ప్రమాదకరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం అవకాశం ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

ఐటి రంగంపై ప్రభావం చూపుతున్న మార్పులు
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకొంటున్న మార్పులు ఐటి రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయనే అభిప్రాయాన్ని ఐటి కంపేనీలు అధినేతలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా నుండి తమకు తీవ్రమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ అమెరికా అథ్యక్షుడుగా ఎన్నికైన నేపథ్యంలో ఇండియాలోని ఐటి కంపెనీలకు ఇబ్బందులు తెచ్చేలా మార్పులు చేర్పులు తీసుకురానున్నారు. ఈ మేరకు ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. దీని ప్రభావం ఇండియాలోని ఐటి పరిశ్రమపై తీవ్రంగా చూపనుంది.

మార్కెట్ ను కోల్పోతున్న కంపెనీలు
మార్పులు ఐటి రంగాన్ని దెబ్బతీస్తున్నాయి. బ్రిటన్ , అమెరికా దేశాల్లో చోటుచేసుకొంటున్న పరిణామాలు దేశీయ ఐటి మార్కెట్లలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి.బ్రెగ్జిట్ ఉదంతం, అమెరికా లో ట్రంప్ విజయం సాధించడం కూడ ఐటి కంపెనీలపై తీవ్రంగా చూపుతోంది. దీంతో ఐటి కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి.తమ కస్టమర్లకు తక్కువ సమయంలో ఎక్కువ మెరుగైన సేవలను అందించేందుకు వీలుగా ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ ప్రయత్నాలు చేస్తేనే మనుగడు సాగిస్తామనే అభిప్రాయంతో ఐటి కంపెనీలు ఉన్నాయి.

ఐటి ఉద్యోగుల్లో గుబులు
నూతన సంవత్సరం సందర్భంగా తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రముఖ ఐటి కంపెనీల బాస్ లు రాసిన లేఖలు టెక్కీలకు షాక్ ఇస్తున్నాయి. రానున్న రోజుల్లో ముళ్ళబాటల్లో నడవాల్సిన పరిస్థితులు ఉన్నాయని టెక్కీలను ఐటి కంపెనీల బాస్ లు హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనతో ఉన్నారు. అయితే వినూత్నంగా ఆలోచించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఉంటాయని కంపెనీల అధిపతులు అభిప్రాయంతో ఉన్నారు. ఈ మేరకు ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వినూత్నంగా ఆలోచించాలని కోరుతున్నారు.

ఇన్పోసిస్ సిఈఓ ఉద్యోగులకు ఏం చెప్పాడంటే
శరవేగంగా మారుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ఇన్పోసిస్ మంచి స్థానాన్ని ఆక్రమిస్తోందనే ఆకాంక్షను వ్యక్తం చేశాడు. అయితే భవిష్యత్ లో ఐటి రంగం ముళ్ళబాటలోనే నడవాల్సిన పరిస్థితులు ఉంటాయనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడు.ఎన్నో అడ్డంకులు, అవాంతరాలను అధిగమించాల్సి ఉంటుందని ఆయన ఇన్సోసిస్ సిఈఓ విశాల్ సిక్కా చెప్పారు. ఈ దిశగా పనిచేసేందుకు ఉద్యోగులుమరింత శ్రమపడడంతో పాటు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.బ్రెగ్జిట్, అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు, నోట్ల రద్దు, సైబర్ సెక్యూరిటీ సమస్యలతో పాటు పెద్ద దేశాలను పట్టిపీడిస్తోన్న వలసలు, ఉగ్రవాదం తదితర సమస్యలు ఐటి రంగంపై ప్రభావం చూపుతున్నాయన్నారు.ఆటోమెషన్, టెక్నాలజీ విభాగాల్లో మరింత అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందన్నారాయన.

విప్రో చెర్మెన్ ఆజీం ప్రేమ్ జీ ఏమన్నాడో తెలుసా
2016 లో ఎదురైన సవాళ్ళు, అడ్డంకులను విస్మరించలేమని విప్రో చైర్మెన్ అజీం ప్రేమ్ జీ చెప్పారు. కానీ, వివాదాలపై దృష్టి పెట్టకుండా కామన్ గ్రౌండ్ పై దృస్టిపెట్టాలంటూ నాలుగు సూత్రాలను ప్రేమ్ జీ ఉద్యోగులకు సూచించారు. తోటి మానవులను గౌరవించాలన్నారు. ప్రకృతి పట్ల కూడ అదే గౌరవాన్ని చూపాలని ఆయన సూచించారు.ప్రతి ఉద్యోగి విలువలకు చిత్తశుద్దితో పనిచేయాలని ఆయన సూచించారు. తన రాజస్థాన్ పర్యటనలో అనుభవాలను, ప్రజల పోరాటాలను ఆయన వివరించారు.