బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాహాబాహికి దిగిన కాంగ్రెస్, బీజేపీ

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇన్నిరోజుల పాటు అసెంబ్లీకి మాత్ర‌మే ప‌రిమిత‌మైన క‌ర్ణాట‌క రాజ‌కీయ సంక్షోభం మంగ‌ళ‌వారం రోడ్డున ప‌డింది. కాంగ్రెస్‌, భార‌తీయ జ‌న‌తాపార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు బాహాబాహికి దిగారు. ప‌ర‌స్ప‌రం తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఫలితంగా- ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకుని రావ‌డానికి పోలీసులు రంగ ప్ర‌వేశం చేశారు. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

మూకుమ్మ‌డిగా చావ‌డం ఖాయం..ఈ రాత్రికి ఎక్స్‌ట్రా లార్జ్ పెగ్ వేసి, ప‌డుకోండి మూకుమ్మ‌డిగా చావ‌డం ఖాయం..ఈ రాత్రికి ఎక్స్‌ట్రా లార్జ్ పెగ్ వేసి, ప‌డుకోండి

క‌ర్ణాట‌క‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌-జ‌న‌తాద‌ళ్ (సెక్యుల‌ర్‌) సంకీర్ణ కూట‌మికి గుడ్‌బై చెప్పిన ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు ఆర్ శంక‌ర్‌, న‌గేష్‌ బెంగ‌ళూరు రేస్‌కోర్స్ రోడ్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తున్న స‌మాచారం తెలియ‌గానే కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్నారు. ఆ ఇద్ద‌రు ఎమ్మెల్యేల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. వెంట‌నే బ‌య‌టికి రావాలంటూ కేక‌లు వేశారు. కాంగ్రెస్ నాయ‌కుడు ఇవాన్ డిసౌజా దీనికి సార‌థ్యం వ‌హించారు. అపార్ట్‌మెంట్ గేట్లు ఎక్కి, లోనికి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించారు. అప్ప‌టికే అక్క‌డ మోహ‌రించి ఉన్న పోలీసులు వారిని నివారించారు.

Two Independent MLAs R Shankar and Nagesh, presently at an apartment

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు, పోలీసుల మ‌ధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చెల‌రేగింది. గేటు ఎక్కి లోనికి ప్ర‌వేశించ‌డానికి ప్ర‌య‌త్నించిన కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారు పోలీసులను అడ్డుకున్నారు. ఈ స‌మాచారం తెలియ‌డంతో భార‌తీయ జ‌న‌తాపార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద సంఖ్య‌లో రేస్‌కోర్స్ రోడ్‌కు చేరుకున్నారు. దీనితో కాంగ్రెస్‌-బీజేపీ కార్య‌కర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చెల‌రేగింది. ఒక‌రినొక‌రు తోసుకున్నారు. తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఫ‌లితంగా సంఘ‌ట‌నాస్థ‌లంలో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. పోలీసులు అద‌న‌పు బ‌ల‌గాల‌ను ర‌ప్పించారు. రెండు పార్టీల కార్య‌క‌ర్త‌ల‌ను అదుపులోకి తీసుకున్నారు.

English summary
Congress workers try to storm Nitesh Wimbledon Park- a residential apartment complex where the independents are said to be. The apartment complex is located in Race Course Road close to Vidhana Soudha in Bengaluru. Ivan D Souza, another Congress leader, says that they want to meet their party men who he claims are being held against their will in that apartment complex.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X